టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని (Ram) వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ (Double ismart) అనే చిత్రం లో నటిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం తరువాత రామ్ చేయబోయే ప్రాజెక్ట్ లపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే రామ్ తదుపరి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నట్లు సమాచారం.
ఈ కాంబినేషన్ ఇప్పటికే ఓకే అయినట్లు తెలుస్తోంది. అంతేకాక మరో స్టార్ డైరెక్టర్ అయిన హరీష్ శంకర్ రామ్ కి ఒక పవర్ ఫుల్ స్టోరీ ను నేరేట్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రం పై క్లారిటీ రావాల్సి ఉంది. వీటితో పాటుగా రామ్ వేరే స్టోరీ లను కూడా వింటున్నట్లు తెలుస్తోంది. అయితే రామ్ పుట్టిన రోజు కి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.