నెల్లూరు జిల్లా టిడిపిలో పెల్లుబికిన నిరసనలు

నెల్లూరు జిల్లా టిడిపిలో పెల్లుబికిన నిరసనలు

Published on Mar 29, 2024 12:47 AM IST

ఇప్పటికే ఎన్నికల యొక్క షెడ్యూల్ ప్రకటన రావడంతో ఏపీలో ఆయా ప్రధాన పార్టీలు అన్ని కూడా ఓటర్లని ప్రసన్నం చేసుకునేందుకు సమాయత్తం అవుతున్నాయి. గతంలో మాదిరిగా వైసిపి పార్టీ ఈసారి కూడా ఒంటరిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తుంటే, టిడిపి పార్టీ మాత్రం జనసేన, బిజెపి లతో కలిసి కూటమిగా పోటీ చేయనుంది. దానికి సంబంధించి ఇప్పటికే పలు ప్రాంతాల్లో టిడిపి తమ అభ్యర్ధాలులని ప్రకటించగా నేటి చివరి జాబితా అభ్యర్థుల ప్రకటన సందర్భంగా పలు ప్రాంతాల నాయకుల నుండి నిరసన గళాలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా టిడిపి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ మాజీ ఎమ్యెల్యే విష్ణువర్ధన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసారు. 

అలానే మరొక టిడిపి నాయకుడు వైకుంఠం ప్రభాకర్ చౌదరి చంద్రబాబు పై పలు విమర్శలు చేసారు. గుంతకల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆగ్రహంతో నారా చంద్రబాబునాయుడు గారు నియోజకవర్గం నాయకులకు కాదని పక్క నియోజకవర్గ నాయకులకు టికెట్ కేటాయించారని బాబు ఫోటోని మంటల్లో వేసి కాల్చిన దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తంగా టిడిపికి నేటి తుది జాబితా ప్రకటన అనంతరం నిరసనల హోరు ఎక్కువైంది. మరి ఈ ఎన్నికల్లో ఎంతమేర వారికి ప్రజల మద్దతు లభిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు