ఉనికి కోసం ఆంధ్ర కాంగ్రెస్ ఆరాటం

ఉనికి కోసం ఆంధ్ర కాంగ్రెస్ ఆరాటం

Published on Jan 3, 2024 3:31 PM IST

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ఎంతో వెలిగిపోయిన కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేక తెలంగాణ ఇచ్చేసిన అనంతరం అక్కడ అయితే బలపడింది కానీ ఇటు ఆంధ్రలో మాత్రం పూర్తిగా పాతాళానికి వెళ్లిపోయింది. నిజానికి పదుల సంఖ్యలో ముఖ్యమంత్రులు అదే సంఖ్యలో గవర్నర్లు ఢిల్లీ నుంచి గల్లీ వరకూ కాంగ్రెస్ నాయకుడు అనే ట్యాగ్ లైన్ ఎంతో ఘనంగా క్యాడర్ మెడలో కండువా గర్వంగా ఉండేది. కానీ ఆ వెన్నెలరోజులు ముగిశాయి. ఆంధ్రప్రదేశ్ ను తమ రాజకీయ ప్రయోజనాలకోసం విడగొట్టిన కాంగ్రెస్ ను సీమాంధ్ర ప్రజలు తమ క్రోధాగ్నిలో భస్మం చేసేసారు. సమీప భవిషత్తులో కోలుకునే అవకాశం లేకుండా చేసారు.

దీనికి తోడు దివంగత మహానాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత అయన కుటుంబాన్ని, ముఖ్యంగా కుమారుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల కాంగ్రెస్ కర్కశంగా వ్యవహరించిన వైఖరిని అంగీకరించని ప్రజలు ఆ పార్టీని నేలమట్టం చేసేశారు. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆంధ్రాలో ఎక్కడా కనీస ఓట్లు దక్కలేదు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పేరు తలచుకోవడానికి సైతం కార్యకర్తలు ఇష్టపడడం లేదు. అయినా సరే 2014, 2019 ఎన్నికల్లో కొందరు నాయకులు కేంద్ర మంత్రులుగా చేసినవాళ్లు సైతం పట్టుమని పదివేల ఓట్లు సాధించలేక కుదేలైపోయారు.

కేంద్ర మంత్రిగా పని చేసిన  పల్లం రాజు కాకినాడలో పోటీ చేస్తే 8,640 ఓట్లు వచ్చాయి. ఇంకో కేంద్ర మంత్రి చింతా మోహన్ తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేస్తే 9585 ఓట్లు వచ్చాయి. ఇంకో సీనియర్ నాయకుడు సాకే శైలజానాథ్ సింగనమలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 1384 ఓట్లు వచ్చాయి. అయితే తమ పార్టీ యొక్క అస్తిత్వాన్ని ఆంధ్రలో కాపాడుకునేందుకు ఇకపై కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా ముందుకు సాగుతుందో చూడాలి మరి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు