ప్రశాంత్ కిషోర్ మాటల్లో శాస్త్రీయత ఎంత ?

ప్రశాంత్ కిషోర్ మాటల్లో శాస్త్రీయత ఎంత ?

Published on Apr 7, 2024 9:59 PM IST

ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా బిజెపి, వైయస్సార్ కాంగ్రెస్ సహా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు పని చేసి ఇప్పుడు ఆ వ్యూహకర్త అవతారం చాలించి బీహార్లో పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా రూపుదాల్చారు. ఎలాంటి సర్వేలు నివేదికలు లేకుండానే నోటికొచ్చిన అభిప్రాయాలు ఆయన చెబుతుంటారు. ఇక రానున్న ఎన్నికల్లో సీఎం వైయస్ జగన్ గెలవడం కష్టమని ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అలాంటిదే. వాస్తవానికి ఆయనకు ఆంధ్రాలో ఎలాంటి సర్వే వ్యవస్థ మరియు నెట్ వర్క్ లేదు సరికదా ప్రజాభిప్రాయాలు తెలుసుకునే అవకాశం లేనే లేదు. మరి అటువంటపుడు ప్రశాంత్ ఇలా ఓపెన్ గా స్టేట్మెంట్ ఎలా ఇస్తారనేది పలువురి ప్రశ్న. 

గతంలో కూడా అయన ఇలా నోటికొచ్చింది చెప్పారు. ఫలితాలు చూస్తే పూర్తిగా రివర్స్ అయ్యాయి. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కెసిఆర్ కు తిరుగులేదు బిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొడుతుందని అలానే  కర్ణాటకలో బీజేపీ వస్తుంది అన్నారు. తీరా ఫలితాలు చూస్తే ఈ రెండూ ఓడిపోయాయి. ఇక ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్, ఉత్తరాఖండ్ లో బిజెపి గెలుస్తుంది అన్నారు. కాగా ఆ ఫలితాలు రివర్స్ అయ్యాయి. మరి ఇప్పుడు అదేవిధంగా జగన్ గెలవటం కష్టం, లోక్ సభ  ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ మొదటి స్థానంలో నిలుస్తుంది, దక్షిణాదిలో బీజేపీ భారీగా సీట్లు గెలుస్తుంది అని నిన్న ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారు. పై మూడు అభిప్రాయాల్లో లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ మొదటి స్థానంలో నిలుస్తుంది అనేది నిజం కావాలి అంటే బీజేపీ కనీసం ఎనిమిది ఎంపీలు గెలవాలి. కానీ తెలంగాణాలో బీజేపీకి ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. 

తమిళనాడులో అన్నమలై ఎంత  బాగా పని చేస్తున్నా అక్కడ రెండు మూడు ఎంపీ సీట్లు గెలవటం కష్టం. దక్షిణాదిలో బీజేపీ నమ్మకం పెట్టుకుంది కర్ణాటక మీద, 2019 ఎన్నికల్లో మొత్తం 27 స్థానాల్లో 25 సీట్లు గెలిచింది. ఇప్పుడు డజన్ల సీట్లు గెలవొచ్చని అంచనా. దక్షిణాదిలో బీజేపీ భారీగాసీట్లు గెలుస్తుందన్న ప్రశాంత్ కిషోర్ అంచనా నిజం కావాలి అంటే మొత్తం సౌత్ లో బీజేపీ కనీసం 30 సీట్లు గెలవాలి లేదా 2019లో గెలిచిన 25 సీట్లు అన్నా గెలవాలి. కాబట్టి అయన అన్నీ టైం పాస్ కబుర్లు తప్ప అయన మాటల్లో ప్రామాణికత శాస్త్రీయత లేదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు