వైసిపిలో చేరికలతో కూటమికి గట్టి దెబ్బ

వైసిపిలో చేరికలతో కూటమికి గట్టి దెబ్బ

Published on Mar 27, 2024 12:18 AM IST

రానున్న 2024 అసెంబ్లీ ఎన్నికలకు కేవలం మరొక నెలరోజులు మాత్రమే సమయం ఉండడంతో ఎప్పటికప్పుడు పార్టీలు అన్ని కూడా ప్రజలను సంపన్నం చేసుకునేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఇడుపులపాయలో తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం బస్సు యాత్రని ప్రారంభించారు. పలు ప్రాంతాలను చుట్టి ఎక్కడికక్కడ ప్రజలకు తమ పార్టీని మరింతగా చేరువ చేసేందుకు ఆయన శ్రీకారం చుట్టారు. అయితే విషయం ఏమిటంటే, తాజాగా సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ సీనియర్‌ నేత డాక్టర్‌ మస్తాన్‌ యాదవ్‌, రాజంపేట టీడీపీ ఎంపీ ఇంఛార్జి గంటా నరహరి చేరారు. 

ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌రెడ్డి, ఒంగోలు పార్లమెంట్‌ వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు. అలానే టీడీపీ ఏలూరు పార్లమెంట్‌ ఇంఛార్జ్‌ గోరుముచ్చు గోపాల్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి (పాయకరావుపేట). ఇక వీరి చేరికతో రాజంపేట పార్లమెంట్ లో, వెంకటగిరి నియోజకవర్గంలో, ఏలూరు పార్లమెంట్‌, పాయకరావుపేట నియోజకవర్గం వంటి ప్రాంతాల్లో టిడిపి కథ ముగిసినట్లే అని, మరొక్కసారి ఆయా ప్రాంతాలతో పాటు ఏపీలో అనేక స్థానాలు వైసిపి గెలుచుకుని మరొక్కసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయం అని అంటున్నాయి వైసిపి వర్గాలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు