ఆడియో సమీక్ష : దూకుడు – అందరినీ ఆకట్టుకుంటుంది

ప్రిన్స్ మహేష్ బాబు, సమంతా జంటగా నటించిన చిత్రం దూకుడు. భారీ అంచనాలతో ముందుకు వెళ్తున్న ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ నిన్న శిల్ప కళా వేదిక లో ఘనంగా జరిగింది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా కి శ్రీను వైట్ల దర్శకుడు. ఆరు పాటలు ఉన్న ఈ చిత్రం ఆడియో ఎలా ఉందో చూద్దాం.

పాట : నీ దూకుడు
గాయకులు: శంకర్ మహదేవన్
మాటలు: విశ్వ
ఇది హీరో ఎంట్రీ పాట అని యిట్టె అర్ధం అయిపోతుంది. మంచి ఊపు, ఉత్సాహం తో సాగే ఈ పాటకు తమన్ మంచి సంగీతం ఇచ్చాడు. శంకర్ మహదేవన్ ఎంతో ఉత్సాహంతో ఆలపించిన ఈ పాటకు మంచి స్పందన వస్తుంది.

 

పాట : గురువారం
గాయకులు: రాహుల్ నంబియార్
మాటలు: రామ జోగయ్య శాస్త్రి
పాట చాలా మృదువుగా, మనోహరంగా సాగిపోతుంది. రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ఏంటో రొమాంటిక్ గా ఉండగా, దీనిని రాహుల్ నంబియార్ చక్కగా ఉపయోగించుకున్నాడు. పాటలో మంచి సృజనాత్మకమైన ప్రేమ వినపడుతుంది

 

 

పాట : చుల్బులి చుల్బులి
గాయకులు: కార్తీక్, రిటా
మాటలు: రామ జోగయ్య శాస్త్రి
రోబోట్ సినిమాలోని “కిలిమంజారో” పాట లాగా సాగుతుంది ఈ పాట. రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం చాలా సాధారణంగా ఉంటుంది. రిటా, కార్తీక్ ల గాత్రం ఈ పాటకు కాసింత ఊరటను ఇస్తుంది. తమన్ సంగీతం అంతంత మాత్రమే. సినిమా లో ఈ పాట అందంగా కనపడే అవకాశం ఉంది.

 

పాట : పూవై పూవై
గాయకులు: రమ్య, నవీన్ మాధవ్
మాటలు: రామ జోగయ్య శాస్త్రి
ఈ పాట సంగీతం చాలా ఊపుతో మంచి వినోదాన్ని ఇస్తుంది. షోలే సినిమాలోని “మెహబూబా” పాటను తలపించే ఈ గీతానికి రమ్య చక్కటి గాత్రాన్ని అందించింది. పాట వింటున్నంత సేపు ఇది ఐటెం సాంగ్ అనే విషయాన్నీ మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది రమ్య గాత్రం. రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్య కొంటె గా, చిలిపి గా ఉంటూ, శ్రోతలను కవ్విస్తుంది. తమన్ ఈ పాటకు చక్కటి సంగీతాన్ని అందించాడు.

పాట : దేతడి దేతడి
గాయకులు: కార్తీక్, రిటా
మాటలు: భాస్కర బాట్ల

ఇది మంచి మాస్ పాట. ఫాన్స్ ను, బి. ,సి. సెంటర్లలో ప్రేక్షకులను ఈ పాట చక్కగా అలరిస్తుంది. రంజిత్, దివ్య ఆలపించిన ఈ పాటలో మంచి ఊపు ఉంటుంది. వినగానే శ్రోతలను ఆకట్టుకునే పాట ఇది. భాస్కర బాట్ల అందించిన సాహిత్యం సాధారణం గానే ఉన్నా, తమన్ అందించిన సంగీతం ఈ పాటకు ప్రాణం పోస్తుంది

 

పాట : అదర ఆదరగొట్టు
గాయకులు: కార్తీక్, కోటి, రామ జోగయ్య శాస్త్రి, వర్ధిని, రనిన రెడ్డి
మాటలు: రామ జోగయ్య శాస్త్రి
ఇది శ్రీను వైట్ల మార్కు పాట. అయన చిత్రాలలో ఉండే పెళ్లి సీన్లలో ఈ పాటలు వినిపిస్తాయి.ఈ పాట ఫరవాలేదు అనిపిస్తుంది. చిత్రం లో ఒక కీలక తరుణం లో ఈ పాట వచ్చే అవకాశం ఉంది.

విశ్లేషణ: మహేష్ బాబు కు ఒక మంచి ఆడియో లభించింది. ఒక భారీ బ్లాక్ బస్టర్ సాధించేందుకు సగం దోహద పడుతుంది ఈ చిత్రం ఆడియో. ప్రతి ఒక్కరికి ప్రియమైన తరహా పాటలు ఇందులో మనకు వినిపిస్తాయి. దేతడి దేతడి, పూవై పూవై, గురువారం, నీ దూకుడు పాటలు చాలా బాగున్నాయి. మొత్తానికి మహేష్ బాబు ఫాన్స్ కు పండగ మొదలైనట్టే

– మహేష్.కె

సంబంధిత సమాచారం :

X
More