సమీక్ష: బెల్ బాటమ్ – అక్షయ్ కుమార్ కోసం మాత్రమే!

Published on Aug 20, 2021 3:02 am IST
Raja Raja Chora movie review

విడుదల తేదీ : ఆగస్టు 19, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

తారాగణం: అక్షయ్ కుమార్, హుమ ఖురేషీ, వాణి కపూర్

దర్శకత్వం: రంజిత్ తివారీ

నిర్మాత : వశు భగ్నాని, జాక్కీ భగ్నాని

సంగీతం : డానియల్ బి. జార్జ్, అమాల్ మాలిక్

స్క్రీన్ ప్లే : రాజీవ్ రవి

సినిమాటోగ్రాఫర్ : చందన్ అరోరా

 

బెల్ బాటమ్ చిత్రం దేశ వ్యాప్తంగా విడుదల అయిన పెద్ద చిత్రం. అక్షయ్ కుమార్ మరియు వాణి కపూర్ లు నటించిన స్పై డ్రామా చిత్రం. ఇది ఎలా ఉందో చూద్దాం రండి.

 

కథ:

ఈ చిత్రం 1984 లో సెట్ చేయబడింది అని చెప్పాలి. ఒక భారతీయ విమానం పాకిస్తాన్ ఉగ్రవాదుల చేత హైజాక్ చేయబడుతుంది. ఆ సమయం లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ (లారా దత్తా) నేతృత్వం లోని భారత ప్రభుత్వం పాకిస్తాన్ తో చర్చలు జరపవలసి వస్తోంది. అన్షుల్ అనగా రా ఏజెంట్ అయిన అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ లోకి ప్రవేశించడం జరుగుతుంది. అన్ని చర్చలను ఆపండి అంటూ ప్రైమ్ మినిస్టర్ ను అక్షయ్ అడుగుతాడు. అన్ని అంశాలను అతను కంట్రోల్ చేస్తూ, హైజాక్ చేయబడిన విమానాన్ని సురక్షితంగా తిరిగి తీసుకు రావడం జరుగుతుంది. అతను ఎలా తీసుకు వస్తాడు అనేది బెల్ బాటమ్ పూర్తి కథ అని చెప్పాలి.

 

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమా లో బెస్ట్ పార్ట్ అక్షయ్ కుమార్ అని చెప్పాలి. రా ఏజెంట్ గా చాలా బాగా చేశాడు అని చెప్పాలి. అందరూ ఊహించిన విధంగా అక్షయ్ కుమార్ డైలాగ్ డెలివరీ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాను బాగా ఎలివేట్ చేసింది. లారా దత్తా ఇందిరా గాంధీ పాత్రలో ఒదిగి పోయి చాలా బాగా చేశారు అని చెప్పాలి. అంతేకాక తనకు అనుగుణంగా మేకప్ కూడా కరెక్ట్ గా ఉందని చెప్పాలి.

వాణీ కపూర్ సినిమా లో పెద్దగా చేయడానికి ఏమీ లేదని చెప్పాలి. సెకండ్ హాఫ్ లో మొత్తం యాక్షన్ పార్ట్ బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో హుమ ఖురేషీ పాత్ర కొంచెం సేపు ఉన్నప్పటికీ చక్కగా చేసింది అని చెప్పాలి. ఈ చిత్రం లో పాకిస్తాన్ ఏజెంట్ లుగా నటించిన వారి నటన కూడా బాగుంది. ప్రొడక్షన్స్ విలువలు మరియు సెటప్ అంతా కూడా బావుంది. కెమెరా పనితనం సినిమా ను మరింత ఆకట్టుకొనే విధంగా ఉంది.

 

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రం లోని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు మొదటి పార్ట్ కి భంగం కలిగించే విధంగా ఉంటాయి. చాలాసేపు తర్వాత మెయిన్ పాయింట్ లోకి అడుగు పెడుతుంది. ఫస్ట్ హాఫ్ చాలా డల్ గా అనిపిస్తుంది. ఇండియా మరియు ప్రత్యర్ధి పాకిస్తాన్ కి సంబంధించిన రిపీటెడ్ సన్నివేశాలు ఉంటాయి.

ఇచ్చిన వాగ్దానం మేరకు చేసిన ప్రధాన యాక్షన్ భాగం సినిమా లో స్పష్టం గా లేదు. ఈ చిత్రం లో చాలా డ్రామా ఉంది, మరి కొంత ఉండేలా ఉంటే ఇంకా బావుండేది. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు ఇండియా కి సంబంధించినవి చాలా బావున్నాయి, అయినా అవి గతం లో చాలా సినిమాల్లో చూసినవే.

సెకండ్ హాఫ్ లో సినిమా చాలా బాగున్నప్పటికీ మేకర్స్ కొన్ని సన్నివేశాల్లో మరింత ఎడిట్ చేస్తే బావుండేది. ముందుగా ఏం జరుగుతుంది అనేది ప్రేక్షకుడు ముందుగానే ఊహించగలిగే విధంగా ఉంటుంది. సినిమా లో ట్విస్ట్ కూడా ముందే అర్దం అయ్యేలా ఉంటుంది.

 

సాంకేతిక విభాగం:

ముందుగా చెప్పినట్లు గానే మేకర్స్ ఈ సినిమా కోసం బాగా ఖర్చు చేశారు. ఖర్చు కి తగ్గట్లుగా స్క్రీన్ పై అది కనిపిస్తుంది అని చెప్పాలి. ఈ పీరియడ్ డ్రామా లో కాస్ట్యూమ్స్ మరియు మేకప్ చాలా ప్రభావ వంతం గా ఉన్నాయి. మ్యూజిక్ పర్వాలేదు అనిపించినా, సెకండ్ హాఫ్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అధ్బుతంగా ఉందని చెప్పాలి. వి ఎఫ్ ఎక్స్ ఓకే, ఇంకా బాగా చేసే అవకాశం ఉంది.

దర్శకుడు రంజిత్ తివారీ సినిమా ను ఓకే అనే విధంగా తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ లో డ్రామా ను మాత్రమే బిల్డప్ చేయడం జరిగింది.అంతగా థ్రిల్ కి గురి అయ్యే విధంగా లేదని చెప్పాలి. సెకండ్ హాఫ్ బావుంది కానీ, అంతగా ప్రభావితం చేసే విధంగా లేదని చెప్పాలి.

 

తీర్పు:

మొత్తం మీద బెల్ బాటమ్ చిత్రం ఒక హైజాక్ డ్రామా. ఫస్ట్ హాఫ్ మామూలుగా, సెకండ్ హాఫ్ బావుంది. మొదటి సగం కేవలం కథ కి బిల్డప్ మాత్రమే. ఫస్ట్ హాఫ్ డల్ గా ఉంటుంది. మీరు మొదటి పార్ట్ మీద సమయం కేటాయించ గలిగితే రెండవ పార్ట్ అక్షయ్ కుమార్ యొక్క ప్రయత్నం మీకు కచ్ఛితంగా నచ్చుతుంది.

123telugu.com Rating :  2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :