సమీక్ష: ఎగిసే తారాజువ్వలు – తారా జువ్వ సరిగ్గా ఎగరలేకపోయింది

Egise Tarajuvvalu movie review

విడుదల తేదీ : నవంబర్ 14, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : మహేష్ కత్తి

నిర్మాత : నాగమల్లా రెడ్డి

సంగీతం : గంటశాల విశ్వనాధ్

నటీనటులు : మాస్టర్ యస్వంత్ రెడ్డి, సౌమ్య వేణుగోపాల్, ప్రియదర్శి, అజయ్ ఘోష్

చిన్న పిల్లల కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘ఎగసే తారా జువ్వలు’ మహేష్ కత్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉంది ? ప్రేక్షకులను అలరిస్తోందా లేదా ? చూద్దాం.

కథ :

చిన్న పిల్లలు తప్పు చెయ్యడం సహజం. వారిని టీచర్స్ మందలించడం సహజం. తప్పు చేసిన పిల్లలని శిక్షించిన అధ్యాపకుడిపై నిరసన తెలిపిన తండ్రి తను చేసిన పొరపాటు గుర్తించాడా ? చదువుకొనే పిల్లలు చేసిన పొరపాటు ఏంటి ? ఏ సమయాల్లో విద్యార్థి తల్లి తండ్రులు వారి పిల్లల పట్ల ఏలా రెస్పాండ్ అవుతారన్నది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ మధ్య మనం గమనిస్తే గ్రామాల్లో చిన్న చిన్న పాఠశాలల్లో చదువుకొని ఇప్పుడు మంచి స్థానంలో ఉన్న పూర్వ విద్యార్థులు స్వచ్ఛందంగా డబ్బు పోగు చేసి అవసరం ఉన్నవారికి అందజేయడం చేస్తున్నారు. ఈ విషయాన్ని సినిమాలో చూపించడం మంచి ప్రయత్నం. చిన్న పిల్లలు స్కూల్ లో ఉన్నప్పుడు వారికి వచ్చే చిన్న చిన్న సమస్యలను వారే తెలివిగా పరిష్కరించుకుంటారు. నోరు లేని జీవాలను బలి చేసిన కొందరు దుండగులు పిల్లలు అధికారులకు పట్టించిన సన్నివేశం బాగుంది.

బడిలో విద్యార్థులు అందరు ‘సైన్స్ ఫేర్’ వెళ్ళాలి అనుకుంటారు. ఆ సమయంలో వారిదగ్గర డబ్బు ఉండదు. కొంత డబ్బు టీచర్ ఇవ్వాలనుకుంటుంది. అదే సమయంలో గ్రామస్థులు కొంత డబ్బు పిల్లలకోసం ఇవ్వడం జరుగుతుంది. పేద వారు అయినప్పటికీ పిల్లలకోసం ఇలా తమ సొంత డబ్బు ఇవ్వడం అనేది గొప్ప విషయం. మానవత్వానికి దగ్గరగా ఉంది ఈ ఎపిసోడ్.

మైనస్ పాయింట్స్:

పిల్లలు తప్పు చెయ్యడం వాటిని పెద్దలు సర్ది చెప్పడం. టీచర్స్ పిల్లలకు ఏ విధంగా బుద్ది చెబుతారు అలాగే పిల్లల తెలివితేటలు ఏవిధంగా ఉంటాయి అన్న పాయింట్ బాగా రాసుకున్న దర్శకుడు దాన్ని తెరమీద చూపించడంలో విఫలం అయ్యాడు. సన్నివేశాలు చూడ్డానికి గొప్పగా లేవు. చిన్న పిల్లల గురుంచి సినిమా చేస్తున్నప్పుడు హృదయానికి హత్తుకొనిపోయే సన్నివేశాలు, మాటలు ఉండాలి కానీ ఈ సినిమాలో అవేవి కనబడలేదు. కథనం నిధానంగా సాగుతుంది. సినిమా నిడివి తక్కువగా ఉన్నా ఆ కొంత సమయం కూడా బోర్ కొట్టిస్తుంది.

దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ కు అతను స్క్రీన్ మీద ప్రేక్షకులకు చూపిస్తున్న దానికి పొంతన లేదు. అనవసరంగా చాలా సీన్స్ ఉన్నాయి. ఉదాహరణకు టీచర్ కు ఒక స్టూడెంట్ కావాలని రాయితో కొట్టాడు అది తెలుసుకోలేని టీచర్ నానా రాద్ధాంతం చేస్తాడు. ఆ సన్నివేశం ఎందుకో అసలు ఈ సీన్ తో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాదు. ఇలా చాలా సీన్స్ అర్థం పర్థం లేకుండా ఉన్నాయి.

సాంకేతిక విభాగం:

డైరెక్టర్ కత్తి మహేష్ ఎంచుకున్న పాయింట్ కొంతవరకు బాగున్నా దాన్ని పూర్తి స్థాయిలో ప్రేక్షకులకు అర్థం అయ్యేలా చెప్పలేక పోయాడు. నేపధ్య సంగీతం బాగుంది. సినిమా లెన్త్ తక్కువగా ఉండడం కొంతవరకు మంచిది. ఎందుకంటే కథ చిన్నది కావున తక్కువ టైంలో కథనం చెప్పడం జరిగింది. సెకండ్ పార్ట్ లో ఎడిటర్ చాలా సన్నివేశాలు కత్తిరించడం వలన ప్రేక్షకులు సహనం కోల్పోరు. తక్కువ బడ్జెట్ లో తీసినా నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

ఎగేసే తారా జువ్వలు అంటే చిన్న పిల్లల సినిమా అని ఎవరైనా కనిపెట్టేస్తారు. కానీ ఇంట్లో తల్లితండ్రులు ఈ సినిమాను చూపించడానికి పిల్లలను తీసుకెళితే మాత్రం వారికి నిరాశ తప్పదు. పిల్లలను ఎంటర్టైన్ చేసే ఏ అంశాలు ఈ సినిమాలో లేవు. వారిని ఇబ్బంది పెట్టడం వారి సమస్యలు ఇలా సినిమా అంతా ఒకే తాటిపై నడుస్తుంది.. కావున ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారు. చిన్న పిల్లల సినిమా అంటే ఆలోచింపచేసేలా ఉండాలి కానీ ఈ సినిమాలో అనవసరపు సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో ఆకట్టుకోకపోవచ్చు. హోప్స్ పెట్టుకుని వెళ్లి ఈ సినిమా చూడాలనుకున్న వారికి నిరాశే తప్పదు.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

 
Like us on Facebook