సమీక్ష : ఎందుకో ఏమో – కొత్తదనం లేని రివేంజ్ డ్రామా

సమీక్ష : ఎందుకో ఏమో – కొత్తదనం లేని రివేంజ్ డ్రామా

Published on Sep 13, 2018 2:38 AM IST
Enduko-Emo movie review

విడుదల తేదీ : సెప్టెంబర్ 12, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : నందు, నోయల్, పునర్నవి భూపాళం

దర్శకత్వం : కోటి వద్దినేని

నిర్మాతలు : మాలతీ వద్దినేని

సంగీతం : ప్రవీణ్

సినిమాటోగ్రఫర్ : రాజ్

ఎడిటర్ : మధు

నందు, నోయల్ , పునర్నవి భూపాళం ముఖ్య పాత్రల్లో నూతన దర్శకుడు కోటి వద్దినేని తెరకేకించిన చిత్రం ‘ఎందుకో ఏమో’. ఈరోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ :

కార్తిక్ (నందు ) సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తూ తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని ఆశపడుతాడు. ఈక్రమంలో హారిక (పునర్నవి) కార్తీక్ ఉంటున్న అపార్ట్మెంట్ లో వుండానికి వస్తుంది. మొదటి చూపులోనే తన తో ప్రేమలో పడుతాడు కార్తీక్ . ఒక చిన్న సంఘటనతో కార్తీక్ ను అపార్థం చేసుకొని అతని మీద కోపం పెంచుకుంటుంది. హారిక కూడా కార్తీక్ పనిచేసే కంపెనీ లో పని చేస్తుంది. ఆ తరువాత కార్తీక్ మనుసు తెలుసుకొని హారిక కూడా ప్రేమించడం మొదలు పెడతుంది. అంత ఓకే అయ్యి వాళ్లిదరు పెళ్లి చేసుకుందామని అనుకొనేలోపు వాళ్ళిద్దరి మధ్యలోకి ప్రిన్స్ (నోయల్) ఎంటర్ అవుతాడు. ప్రిన్స్ , కార్తీక్ ఇద్దరు చిన్నప్పటినుండి స్నేహితులు. హారిక ను చూసి తనను ఎలాగైనా దక్కించుకోవాలని అనుకుంటాడు. దానికి కార్తీక్ ను రెచ్చగొట్టి అతనితో ప్రిన్స్ నెలరోజుల్లో హరికను పడగొతానని పందెం కాస్తాడు. దాంట్లో భాగంగా హారిక ను ఇంప్రెస్ చేస్తూ ఆమెకు దగ్గరవుతాడు. హారిక కూడా కార్తీక్ ను పక్కకుపెట్టి ప్రిన్స్ కు దగ్గరయినట్లుగా నటిస్తుంది. ఆ తరువాత కార్తీక్ ఏమయ్యాడు ? హారిక,ప్రిన్స్ కు ఎందుకు దగ్గరవ్వలనుకుంటుంది? ప్రిన్స్ ఏం చేశేవాడు అనేదే మిగితా కథ .

ప్లస్ పాయింట్స్ :

హీరో పాత్రలో నటించిన నందు తన సెట్టిల్డ్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. కార్తీక్ పాత్రకు చక్కగా సరిపోయాడు. ఇక హారిక పాత్రలో పునర్నవి బాగా చేసింది. ప్రిన్స్ పాత్రలో నోయాల్ అదరగొట్టాడు. ప్లే బాయ్ పాత్రలో నటించి ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. ఇక కమెడియన్ పాత్రలో సుడిగాలి సుధీర్ చేసిన కామెడీ నవ్విస్తుంది. మొదటి సారి సుధీర్ కు ఎక్కువ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం లభించింది.

నూతన దర్శకుడు కోటి వద్దినేని సెకండ్ హాఫ్ లో తన ప్రతిభ చూపెట్టాడు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఊహించిందే అయినా చక్కగా చూపెట్టాడు. పాత్రలకు సరిపోయే నటీనటులను ఎంచుకొని వరిదగ్గర్నుండి ఆయన కావాల్సింది రాబట్టుకోవడంలో విజయం సాధించాడు. సీనియర్ నటుడు పోసాని కృష్ణ మురళి ఉన్నంతలో బాగానే నవ్వించారు.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు రాసుకున్న కథ రొటీన్ గా వుండి ఫస్ట్ హాఫ్ చాలా విసుగు తెప్పిస్తుంది. ముఖ్యంగా స్టోరీలోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకున్నారు. ఇక ఫస్ట్ హాఫ్ లో కార్తీక్ , హారిక మధ్య సరైన రొమాంటిక్ ట్రాక్ పెట్టివుంటే బాగుండేది. కేవలం ఒక్క సంఘటనతో లవ్ లో పడడం ఆ ట్రాక్ కూడా ఆసక్తిగా వుండకపోవడంతో ప్రేక్షకులు నీరసం తెప్పిస్తుంది. ఇక తెర నిండా జబర్దస్త్ కమెడియన్స్ కనిపించిన అనుకున్నంత హాస్యాన్ని ఇవ్వలేకపోయారు. ఒక్క సుడిగాలి సుధీర్ పాత్ర మాత్రమే ఎంటర్ టైన్ చేస్తుంది.

ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ బాగున్నా కూడా అది ఇంతకుముందు ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుంది. కాకపోతే కథనం తో ఆ ఫీలింగ్ పోగొట్టే ప్రయత్నం చేశాడు దర్శకుడు. దాంట్లో కొంతవరకు సక్సెస్ అయ్యాడు. సెకండ్ హాఫ్ లోలాగే ఫస్ట్ హాఫ్ ను కూడా ఆసక్తికరంగా రాసుకొని ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేదే.

సాంకేతిక వర్గం :

కొత్త దర్శకుడైన తను అనుకున్నది తెర మీద చూపెట్టడంలో చాలా వరకు విజయం సాధించాడు . తన ద్రుష్టి అంత సెకండ్ హాఫ్ మీద పెట్టడంతో ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టించింది. ఫస్ట్ హాఫ్ ను మంచి ట్విస్ట్ లతో ఆసక్తికరంగా తెరకెక్కించే ఉంటే దర్శకుడికి మెదటి సినిమా తో మంచి విజయాన్ని అందుకొని వుండు. ఆ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోలేక పోయాడు.

ఇక ప్రవీణ్ సంగీతం పర్వాలేదనిపించింది. సినిమాలో మూడు పాటలున్న ఏఒక్కటి గుర్తుండిపోదు. శేఖర్ చంద్ర అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. మధు ఎడిటింగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలను ఇంకా కట్ చేసి ఉంటే బాగుండేది. రాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. మాలతీ వద్దినేని నిర్మణావిలువలు పర్వాలేదు.

తీర్పు :

నూతన దర్శకుడు కోటి తెరకెక్కించిన ఎందుకో ఏమో చిత్రంలో విసిగించే ఫస్ట్ హాఫ్ , సరైన కామెడీ , పాటలు అలాగే బలమైన సన్నివేశాలు లేకపోవడం సినిమాకు మైనస్ కాగా సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ నోయల్ , నందు నటన ఆకట్టుకునే అంశాలు అని చెప్పవచ్చు. రివెంజ్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ చిత్రం నచ్చుతుంది. మిగతా వారిని ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోక పోవచ్చు.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు