సమీక్ష : “హెడ్స్ అండ్ టేల్స్” – తెలుగు చిత్రం జీ5 లో ప్రసారం

సమీక్ష : “హెడ్స్ అండ్ టేల్స్” – తెలుగు చిత్రం జీ5 లో ప్రసారం

Published on Oct 23, 2021 3:01 AM IST
Heads&Tales Movie Review

విడుదల తేదీ : అక్టోబర్ 22, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: సునీల్, సుహాస్, శ్రీవిద్య మహర్షి, దివ్య శ్రీపాద, చాందిని రావు

దర్శకుడు: సాయి కృష్ణ ఎన్‌రెడ్డి

నిర్మాతలు: ప్రదీప్ అంగిరేకుల, రమ్య చౌదరి

సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్ శాకమూరి

సంగీత దర్శకుడు: మణిశర్మ

ఎడిటర్: కోడటి పవన్ కళ్యాణ్

ఇప్పుడు థియేట్రికల్ సహా పలు సినిమాలు నేరుగా ఓటిటిలో విడుదల అవుతున్న నేపథ్యంలో తాజాగా విడుదల కాబడిన మరో చిత్రం “హెడ్స్ అం టేల్స్”. సునీల్ చిన్న పాత్రలో నటించిన ఈ చిత్రం స్ట్రీమింగ్ యాప్ జీ 5 లో విడుదల అయ్యింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వచ్చినట్టయితే ఈ సినిమా ముగ్గురు ఆడవాళ్లు అలివేలు మంగ(దివ్య శ్రీపాద), శృతి(చండి రావు) అలాగే అనీషా(శ్రీ దివ్య) ల జీవితాల చుట్టూ కనిపిస్తుంది. ముగ్గురుకీ మూడు భిన్నమైన సమస్యలు ఉంటాయి వాటిని ఎదుర్కొంటూ సాగిస్తూ ఉంటారు. మరి ఈ ముగ్గురుకీ ఉన్న ఇబ్బందులు ఏంటి? వాటి నుంచి బయట పడతారా? ఇంతకీ ఈ ముగ్గురికీ ఏమన్నా కనెక్షన్ ఉందా అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే జీ5 లో ఈ సినిమాని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో కనిపించే బేసిక్ పాయింట్ కానీ ముగ్గురు కీలక ఫీమేల్ లీడ్ నటుల పెర్ఫామెన్స్ ఇంప్రెసివ్ గా అనిపిస్తాయి. మొదటగా అలివేలు మంగగా కనిపించిన దివ్య తన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, తన స్లాంగ్ తో ఆకట్టుకుంటుంది.

అలాగే నటి శ్రీదివ్య కూడా తన రోల్ లో మంచి నటనను కనబరిచింది. అలాగే చిన్న క్యామియో రోల్ లో కనిపించిన సునీల్ కూడా ఉన్న కాసేపు తన పాత్రకి జస్టిస్ చేసాడు.

అలానే సినిమాలో కొన్ని విజువల్స్ కానీ నటీనటుల మధ్య కొన్ని సన్నివేశాలు కానీ వాటిని తెరకెక్కించిన విధానం బాగా అనిపిస్తుంది. అలానే మరో నటి శృతి కూడా చిన్నదే అనే తన పాత్రలో బానే ఈజ్ గా నటించింది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో కనిపించే ప్రధాన పాత్రలు వాటి చుట్టూతా నడిచే సన్నివేశాలు ఓ మోస్తరుగా బానే ఉన్నాయి అనిపిస్తుంది. కానీ ఇంకా వాటిలో ఏదో మిస్సవుతున్న అనుభూతి అయితే ఆడియెన్స్ లో కలగొచ్చు. ఇంకా ఆ పాత్రలు బలంగా ఉండొచ్చు కదా సింపుల్ గా ఉన్నాయి అనిపిస్తుంది.

ఇంకా వాటి చుట్టూ మంచి సన్నివేశాలు డిజైన్ చేసి ఉండాల్సింది. అలాగే సినిమాలో పెద్దగా ఇంప్రెస్ చేసే ట్విస్టులు లాంటివి ఉండవు వాటి మూలాన సినిమా ఇంకా సింపుల్ గానే ఉన్నట్టు అనిపిస్తుంది.

అలానే బలమైన ఎమోషన్స్ కూడా పెద్దగా ఈ సినిమాలో కనిపించవు అంతా జస్ట్ సింపుల్ నరేషన్ లో సాగుతూ వెళ్ళిపోతుంది. దీనితో మంచి ఆసక్తితో సినిమా చూసే వాళ్ళకి రుచించకపోవచ్చు.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు మాత్రం నీట్ గా చాలా బాగున్నాయి. అలానే టెక్నీకల్ టీం వర్క్ కూడా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ముఖ్యంగా డైలాగ్స్ సినిమాలో ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ పర్వాలేదు.

ఇక దర్శకుడు సాయి కృష్ణ విషయానికి వస్తే ఓవరాల్ గా తన వర్క్ ఓకే అని చెప్పొచ్చు. తాను తీసుకున్న పాయింట్ బాగుంది కానీ దానిని ఇంకా బాగా ఎలివేట్ చేస్తూ మంచి స్క్రీన్ ప్లే రాసుకొని ఉంటే బావుండేది. ఏదో ఓ మాదిరిగా వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఇంకా మంచి ఎమోషన్స్, స్ట్రాంగ్ డ్రామా పెట్టి ఉంటే ఇంకా బెటర్ అవుట్ పుట్ వచ్చి ఉండేది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసుకున్నట్టయతే ఈ “హెడ్ అండ్ టేల్స్” లో కనిపించే బ్యాక్ డ్రాప్ బాగా అనిపిస్తుంది. అలానే ప్రధాన పాత్రలు కూడా మెప్పిస్తాయి. కానీ మొత్తంగా సినిమా అంతా సింపుల్ గానే అనిపిస్తుంది. మంచి కథనం, ఫ్లో లు సినిమాలో మిస్సయ్యాయి. సో తక్కువ అంచనాలతోనే కాస్త తక్కువ సమయం కేటాయించి ఓటిటిలో సినిమా చూడాలి అనుకుంటే ఓసారి ఈ సినిమా చూడొచ్చు.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు