ఓటిటి సమీక్ష : హారర్ థ్రిల్లర్ “భూమిక” నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం

Bazaar Rowdy movie review

విడుదల తేదీ : ఆగస్టు 23,2021
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: ఐశ్వర్య రాజేష్, విధు, పావెల్ నవగీతన్, మాధురి, సూర్య గణపతి

దర్శకుడు: రథీంద్రన్ ఆర్ ప్రసాద్

నిర్మాతలు : కార్తేకేన్ సంతానం, సుధన్ సుందరం, జయరామన్
సంగీత దర్శకుడు: పృథ్వీ చంద్రశేఖర్
ఎడిటర్: ఆనంద్ గెరాల్డిన్


ప్రస్తుతం మేము కొనసాగుతున్న పలు డైరెక్ట్ స్ట్రీమింగ్ షోస్ మరియు సినిమాలు, సిరీస్ ల సమీక్షల పరంపరలో తాజాగా ఎంచుకున్న చిత్రం “భూమిక”. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటించిన ఈ హారర్ థ్రిల్లర్ లేటెస్ట్ గానే దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియెన్స్ ని ఎంత మేర థ్రిల్ చేసిందో సమీక్షలో పరిశీలిద్దాం రండి.

కథ :

ఇక కథలోకి వచ్చినట్టు అయితే సంయుక్త(ఐశ్వర్య రాజేష్) తన భర్తతో కలిసి ఒక పాడుబడిన స్కూల్ ని పడగొట్టించి అక్కడ వేరే ఇతర భారీ నిర్మాణాలు చేయించాలని ప్లాన్ చేస్తుంది. కానీ అక్కడ ఆ పనులు జరగకుండా ఏదో అతీంద్రయ శక్తి వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. మరి వారిని అడ్డుకుంటుంటున్న ఆ శక్తి ఏంటి? దాని వెనక కథ ఏమిటి వీరికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి ఫైనల్ గా ఏమయ్యింది అన్నవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

జెనరల్ గా మంచి హారర్ థ్రిల్లర్ సినిమాల్లో కోరుకునే పలు ఎలిమెంట్స్ ఈ చిత్రంలో కూడా కనిపించి ఇలాంటి సినిమాల అభిమానులను ఇంప్రెస్ చేస్తాయి. అలాగే ఓ రకంగా ఈ చిత్రంలో కనిపించే స్టోరీ లైన్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. వీటితో పాటుగా ఈ కథ చుట్టూ తిరిగే క్రమంలో ఐశ్వర్య కూడా మంచి నటనను కనబరిచింది.

ఇది వరకే తన నాచురల్ నటనతో మంచి మార్కులను అందుకుంది. అలాగే ఈ సినిమాలో కూడా తన నుంచి మంచి పెర్ఫామెన్స్ కనిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో మరో ఇంప్రెస్ చేసే పాయింట్ క్లైమాక్స్ అని చెప్పాలి. క్లైమాక్స్ లో స్టోరీ రివీల్ కానీ దానిని హ్యాండిల్ చేసిన విధానం కానీ చాలా కొత్తగా అనిపిస్తుంది. అంతే కాకుండా సినిమాలో మెసేజ్ కూడా చూసేవాళ్ళకి బెటర్ ఫీల్ కూడా ఇస్తుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో డెఫినెట్ గా మంచి థీమ్ కనిపిస్తుంది కానీ దానిని తెరకెక్కించిన కథనం కొత్తగా ఏం లేదని చెప్పాలి. చాలా వరకు అన్నీ రొటీన్ ఎపిసోడ్స్ లానే కనిపిస్తుండడం మూలాన ఒకింత ఆసక్తి ఈ చిత్రంపై తగ్గుతుంది. అలాగే హారర్ సీన్స్ కూడా అంత భయ భ్రాంతులకి గురి చేసే విధంగా కూడా ఉండవు.

వీటి మూలాన పర్ఫెక్ట్ హారర్ ఎంటర్టైన్మెంట్ కోసం చూసే ఆడియెన్స్ కి నిరాశ కలగొచ్చు. అలాగే ఆద్యాంతం ఆసక్తికరంగా కొనసాగే స్క్రీన్ ప్లే కూడా ఇందులో మిస్సవ్వడం గమనార్హం. దీనితో చాలా చోట్ల సినిమా అంతా నెమ్మదిగానే కొనసాగుతున్నట్టు బోర్ గా అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు గాని టెక్నీకల్ టీం సపోర్ట్ కానీ బాగుందని చెప్పాలి.. సినిమాటోగ్రఫీ ఈ చిత్రంలో చాలా బాగుంది. అలాగే మ్యూజిక్ కూడా ఇంప్రెసివ్ గా ఉందని చెప్పొచ్చు. కానీ ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండు..

ఇక దర్శకుడు రథీంద్రన్ విషయానికి వస్తే తాను ఎంచుకున్న సబ్జెక్టు నిజంగా ప్లెజెంట్ గా ఉందని చెప్పాలి. కానీ దానిని బెటర్ ఎపిసోడ్స్ తో అలాగే మంచి స్క్రీన్ ప్లే తో రాసుకొని ఉంటే బాగుండేది. అక్కడక్కడా కొన్ని ఎలిమెంట్స్ మెసేజ్ తప్ప పెద్ద గొప్పగా ఎక్కడా అనిపించదు. దీనితో ఈ చిత్రంపై ఆసక్తి పలు చోట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. వీటిలో జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్లైతే మంచి బజ్ తోనే వచ్చిన ఈ హారర్ డ్రామా “భూమిక” లో ఐశ్వర్య రాజేష్ పెర్ఫామెన్స్, స్ట్రాంగ్ క్లైమాక్స్ మరియు నేపథ్యం ఓ మాదిరిగా ఆకట్టుకున్నా అంతగా ఎలివేట్ కాని స్క్రీన్ ప్లే బోర్ గా డల్ గా సాగే కథనం పెద్దగా హారర్ ఎలిమెంట్స్ కూడా లేకపోవడం వంటివి సినిమాపై ఆసక్తిని తగ్గిస్తాయి. మరి వీటిని పక్కన పెట్టి స్లోగా ఉన్నా పర్వాలేదు అనుకునే వారు స్ట్రిక్ట్ గా ఈ చిత్రాన్ని ఓ సారి చూడొచ్చు.

123telugu.com Rating :  2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :