రివ్యూ : “అన్ పాజ్డ్” – హిందీ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం

రివ్యూ : “అన్ పాజ్డ్” – హిందీ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం

Published on Dec 22, 2020 4:00 PM IST

నటీనటులు : గుల్షన్ దేవయ్య, సుమీత్ వ్యాస్, సైయామి ఖేర్, రిచా చడ్డా, అభిషేక్ బెనర్జీ, రత్న పాథక్

దర్శకులు : రాజ్ అండ్ డికె, నిత్య మెహ్రా, నిఖిల్ అద్వానీ, తన్నిష్తా ఛటర్జీ, అవినాష్ అరుణ్

నిర్మాతలు : రాజ్ & డికె, మధు భోజ్వానీ, మోనిషా అద్వానీ, బైసాకి నాయర్, సంజీవ్‌కుమార్ నాయి

సినిమాటోగ్రఫీ : పంకజ్ కుమార్

పలు ఆసక్తికర ఓటిటి వెబ్ సిరీస్ లు అలాగే డిజిటల్ గా రిలీజ్ అవుతున్న సినిమాల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో లేటెస్ట్ గా అమెజాన్ ప్రైమ్ విడియోలోకి వచ్చిన హిందీ చిత్రం “అన్ పాజ్డ్”. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం రండి.

కథ :

ఈ చిత్రంలో మొత్తం ఐదు భిన్నమైన కథలు కనిపిస్తాయి. ఐదుగురు దర్శకులు రాజ్ అండ్ డికె, నిత్య మెహ్రా, నిఖిల్ అద్వానీ, తన్నిష్తా ఛటర్జీ, అవినాష్ అరుణ్ లు ఈ లాక్ డౌన్ సమయంలో ఇరుక్కుపోయిన పలువురు భిన్నమైన వ్యక్తుల మీద తెరకెక్కించబడ్డాయి. మరి భిన్నమైన కథ(ల)లో గుల్షన్ దేవయ్య, అహన్ సుమీత్ వ్యాస్, సైయామి ఖేర్, రిచా చడ్డా, అభిషేక్ బెనర్జీ, రత్న పాథక్ షా, ఇష్వాక్ సింగ్, రింకు రాజ్‌గురు, గీతికా విద్యా ఓహ్లియాన్, లిల్లెట్ దుబే, మరియు శార్దుల్ భరద్వాజ్ వంటి నటీనటులు ఈ చిత్రంలో కీలక కీలక పాత్రల్లో కనిపించారు. మరి క్లిష్టమైన సమయం ఆధారంగా తెరకెక్కబడిన ఈ ఐదు కథల సమ్మేళనంతో ఏం చెప్పారో అన్నది అసలు కథ.

ఏమి బాగుంది?

మొదటగా ఇందులో కనిపించే నటీనటుల కోసం చెప్పుకున్నట్టయితే అది వారిది ఎక్స్ లెంట్ జాబ్ అని చెప్పాలి. ఇండివిడ్యుయల్ గా ప్రతీ ఒక్కరూ కూడా మంచి నటనను కనబర్చారు. రత్న పథక్ షా అలాగే అభిషేక్ బెనర్జీలు అయితే స్పెషల్ మెన్షన్ అని చెప్పాలి. అలాగే ఓ ఒంటరి మహిళగా కనిపించే రత్న ఆమె పాత్రలో అమేజింగ్ అని చెప్పాలి. ఆమెపై డిజైన్ చేసిన కొన్ని సీన్స్ చాలా బాగుంటాయి. వీరితో పాటుగా రిచా చదహ్ ఆమె రోల్ లో చాలా ఎమోషనల్ పోర్షన్ ను అద్భుతంగా చేసారు.

ఇంకా అలాగే అభిషేక్ బెనర్జీపై డిజైన్ చేసిన స్టోరీ కూడా చాలా నీట్ అండ్ ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. అలాగే రింకు, లలిత్ డూబే రోల్స్ కు ఉన్న స్టోరీ కూడా మంచి ఎమోషనల్ టైమింగ్ ఉంటుంది. ఇక మరో కీలక పాయింట్ ఇందులో కనిపిస్తుంది కోవిడ్ క్లిష్ట సమయంలో ఈ ఐదు కథలకు మధ్య ఉండే కనెక్షన్ ను బాగా ఎస్టాబ్లిష్ చేసారు. అలాగే ఈ అన్ పాజ్డ్ లో మంచి నిర్మాణ విలువలు కూడా కనిపిస్తాయి. మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషన్స్ అన్ని ఈ చిత్రంలో బాగా అనిపిస్తాయి.

ఏమి బాలేదు?

ఇక ఈ చిత్రంలో బాగా నిరాశ పైచే అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. మొదటిలో చూపే ఓ షార్ట్ ను రాజ్ మరియు డీకేలు తెరకెక్కించారు. వీరు డిజైన్ చేసిన స్టోరి అసలు లాజిక్ లెస్ గా ఉంటుంది. అలాగే చాలానే ఫ్లాస్ ఈ స్టోరీలో కనిపిస్తాయి.దీనితో పాటుగా మరో రెండు కథలు కూడా అంతగా ఎలివేట్ అయ్యినట్టు అనిపించవు. అలాగే సయామీ ఖేర్ నటనకు కూడా ఎలాంటి స్కోప్ లేకుండా పోయింది.

అలాగే మొదటి రెండు స్టోరీస్ ముగింపు కూడా అంత సమంజసంగా ఉన్నట్టు అనిపించదు. అలాగే మరో మైన్ డ్రా బ్యాక్ ఈ చిత్రానికి ఏమిటంటే లాక్ డౌన్ పూర్తవడం మూలాన కొన్ని కథలు అంత ఇంపాక్ట్ కలిగించకపోవచ్చు, అలాగే ఇలాంటి సినిమాల్లో పైన్ ను చాలా అందంగా చూపించాల్సి ఉంటుంది అది కూడా ఈ చిత్రంలో మిస్సవుతుంది. అలాగే క్యాస్టింగ్ లో మరింత జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ “అన్ పాజ్డ్” అనే అంథాలజీ చిత్రం అంత బాగా ఆకట్టుకోలేనిది అని చెప్పాలి. కొంతమంది నటీనటుల పెర్ఫామెన్స్ లు అలాగే అభిషేక్ బెనర్జీ మరియు రత్న పాథక్ షా లపై డిజైన్ చేసిన లైన్స్ టాప్ మరేమి చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండదు. సరైన ఎమోషన్స్ లేకపోవడం అలాగే కొన్ని స్టోరీస్ కూడా అంత కంప్లీట్ గా అనిపించవు. వీటి మూలాన ఈ డ్రామా జస్ట్ ఓకే అనే రేంజ్ లో అనిపిస్తుంది.

123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు