సమీక్ష : ‘రాజ రాజ చోర’ – డీసెంట్ కామెడీతో సాగే ఎమోషనల్ డ్రామా !

సమీక్ష : ‘రాజ రాజ చోర’ – డీసెంట్ కామెడీతో సాగే ఎమోషనల్ డ్రామా !

Published on Aug 20, 2021 3:03 AM IST
Raja Raja Chora movie review

విడుదల తేదీ : ఆగస్టు 19, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

తారాగణం: శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్, సునైన, రవిబాబు తదితరులు

దర్శకత్వం: హసిత్ గోలి

నిర్మాత : టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగర్వాల్

సంగీతం : వివేక్ సాగర్

స్క్రీన్ ప్లే : హసిత్ గోలి

సినిమాటోగ్రాఫర్ : వేదారమన్ శంకరన్

విలక్షణ పాత్రల కథానాయకుడు శ్రీవిష్ణు హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘రాజ రాజ చోర’. మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్స్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ సినిమా పై ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

భాస్కర్ (శ్రీవిష్ణు) ఒక జిరాక్స్ షాప్ లో పని చేస్తూ.. సాఫ్ట్ వేర్ ఇంజీనియర్ అని అబద్ధం చెప్పి సంజన ( మేఘా ఆకాశ్)ను లవ్ చేస్తూ ఉంటాడు. అలాగే అవసరాల కోసం దొంగతనాలు చేస్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం భాస్కర్ కి ఇదివరకే పెళ్లి అయిందని, ఒక కొడుకు కూడా ఉన్నాడని సంజనకి తెలుస్తోంది. మరి భాస్కర్ కి నిజంగానే పెళ్లి అయిందా ? విద్య ( సునైన) భాస్కర్ కి ఏమి అవుతుంది ? అసలు, భాస్కర్ ఎందుకు సంజనతో అబద్దాలు చెప్పి మోసం చేస్తున్నాడు ? చివరకు భాస్కర్ జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది ? ఈ మధ్యలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

శ్రీవిష్ణు గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ లో మంచి కామెడీ టైమింగ్ తో చాలా బాగా ఆకట్టుకున్నాడు తన క్యారెక్టరైజేషన్ తో వచ్చే ఫన్ తో బాగా నవ్వించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్స్ లో మరియు కొన్ని ఫస్ట్ హాఫ్ లో వచ్చే లవ్ సీక్వెన్స్ లో అలాగే మిగిలిన కామెడీ సీన్స్ లో కూడా శ్రీవిష్ణు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.

ఇక కథానాయకగా నటించిన మేఘా ఆకాశ్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు గ్లామర్ తోనూ ఆకట్టుకుంది. మరో హీరోయిన్ గా నటించిన సునైన సీరియస్ రోల్ లో ప్లజంట్ గా నటించింది. సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో కనిపించిన రవిబాబు ఎప్పటిలాగే అద్భుతంగా నటించాడు. మరో కీలక పాత్రలో కనిపించిన తనికెళ్ల భరణి పాత్ర స్క్రీన్ ప్లేని వివరిస్తూ కథను ముందుకు నడిపిన విధానం బాగుంది.

గంగవ్వ కూడా తన నటనతో మెప్పించింది. ఇక సినిమాలోని మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు హసిత్ గోలి ఫస్ట్ హాఫ్ ని సరదాగా నడిపాడు. అలాగే సెకండాఫ్ లో మంచి మెసేజ్ ఇస్తూ కొంచెం ఎమోషనల్ గా కనెక్ట్ చేసే ప్రయత్నం చేసాడు. మొత్తానికి దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే అలాగే కామెడీని హ్యాండిల్ చేసిన విధానం బావుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

సినిమాలో ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్ గా సాగినా రెండవ భాగం మాత్రం అక్కడక్కడ నెమ్మదిగా సాగుతుంది. అలాగే దర్శకుడు రాసుకున్న స్టార్టింగ్ సీన్స్ కూడా స్లోగా ఉన్నాయి. ఇక కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువ అయింది. అలాగే కామెడీ కోసం కథను పూర్తి సినిమాటిక్ టోన్ లో నడిపాడు దర్శకుడు.

అలాగే సెకండాఫ్ లోని ఎమోషనల్ ట్రాక్ కి సంబంధించి మరింత డిటైల్డ్ గా చూపించి ఉంటే.. సినిమా ఇంకా బెటర్ గా ఉండేది. అయితే, సినిమాలో మంచి స్టోరీ లైన్ ఉన్నా, సినిమాలో విలువైన భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలకి స్కోప్ ఉన్నా, దర్శకుడు మాత్రం ఆ ఎమోషన్స్ ను సస్టైన్ చేయకుండా క్లుప్తంగా ముగించేశాడు.

 

సాంకేతిక విభాగం :

 

దర్శకుడు హసిత్ గోలి తానూ రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్ తో బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. కాకపొతే హసిత్ సెకెండ్ హాఫ్ కథనం పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అందించిన పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే, ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకే బాగా ప్లస్ అయింది. ఇక ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

 

తీర్పు :

 

‘రాజ రాజ చోర’ అంటూ పక్కా ఎమోషనల్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా.. డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ తో మరియు సగటు మనిషికి సంబంధించిన ఒక మంచి మెసేజ్ తో బాగానే ఆకట్టుకుంది. అయితే సినిమా స్టార్టింగ్ సీన్స్, సెకండ్ హాఫ్ లో కొన్ని కీలక సీన్స్ స్లోగా సాగుతూ ఇంట్రెస్ట్ కలిగించవు. కానీ శ్రీవిష్ణు నటన, మేఘా ఆకాశ్, సునైన స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మొత్తమ్మీద ఈ సినిమా మంచి ఎంటర్ టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి చాయిస్ అవుతుంది.

123telugu.com Rating :  3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు