సమీక్ష : ఆకట్టుకోలేకపోయిన సంఘర్షణ

విడుదల తేది : 01 డిశంబర్ 2111
123 తెలుగు .కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకుడు : సముతిరకని
నిర్మాత : వేదరాజు  తిమ్బెర్
సంగిత డైరెక్టర్ : సుందర్  సి . బాబు
తారాగణం :అల్లరి  నరేష్ , స్వాతి , ససికుమార్ , వసుంధర , నీవేద

శశి కుమార్ తమిళ్ లో దర్శకత్వం వహించిన ‘పోరాలి’ చిత్రాన్ని తెలుగులో ‘సంఘర్షణ’ పేరుతో విడుదల చేసారు. ఈ హిత్రం తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైంది. కలర్స్ స్వాతి నటించిన ‘సుబ్రమణ్యపురం’ (తెలుగులో అనంతపురం 1980) చిత్ర విజయం తరువాత ఆ చిత్ర టీం అల్లరి నరేష్ తో కలిసి మరో చిత్రంతో మన ముందుకు వచ్చారు. ఆ చిత్రం ఎలా ఉందొ చూద్దాం.

కథ: శశి కుమార్ మరియు అల్లరి నరేష్ జేబులో చిల్లి గవ్వ లేకుండా హైదరాబాదులో అడుగు పెడతారు. వారు తమ గురించి ఎవరికీ ఏమీ తెలియకుండా ఫ్రెండ్ ఇంట్లో తల దాచుకుంటారు. వారు పెట్రోలు బంకులో పెయిడ్ సర్వీసు అనే బిజినెస్ మొదలు పెడతారు. వారి కష్టపడే తత్వం, ఇతరురాలకు సహాయం చేసే గుణంతో మంచి పేరు తెచ్చుకుంటారు. శశి తమ ఇంటి పక్కనే ఉండే స్వాతితో ప్రేమలో పడతాడు. ఇలా ప్రశాంతంగా మొదటి భాగం సాగుతూ ఉండగా అనుకోని ట్విస్ట్ తో మొదటి భాగం పూర్తవుతుంది. ఇక్కడి నుండి అసలు కథ మొదలవుతుంది. కొంత మంది శశి వెతుకుతుంటారు. గతంలో శశి ఒక హత్య చేసి మెంటల్ హాస్పిటల్ నుండి పారిపోయి వస్తాడు. అతను ఆ ఎందుకు హత్య ఎందుకు చేసాడు అనేది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్: ఈ చిత్రంలో నటించిన నటీ నటులు అందరు బాగా నటించారు. శశి కుమార్ మరియు నరేష్ అయితే పాత్రలో ఒదిగిపోయారు. నరేష్ మూర్చ రోగిగా నటించగా, శశి సైలెంట్ గా ఉండే పాత్రలో కనిపించారు. ఇద్దరు పోటీ పడి నటించారు. స్వాతి ఎప్పట్లాగే అందంగా ఉంది. ఎమోషనల్ సీన్స్ లో బాగా చేసింది. సినిమాటోగ్రఫీ
అధ్బుతంగా ఉంది.

మైనస్ పాయింట్స్: సినిమా నిడివి బాగా పెద్దగా ఉండటంతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో విఫలం అయ్యింది. ఫస్టాఫ్ లో ఉన్న ఇంట్రెస్ట్ సెకండాఫ్ లో లేకుండాపోయింది. మన దేశంలో మానసిక రోగులకు ఎలాంటి చికిత్స చేస్తున్నారు అనే మంచి మంచి పాయింట్ తో వచ్చినా సరిగా మెస్సేజ్ ఇవ్వడంలో మాత్రం డైరెక్టర్ విఫలం అయ్యాడు. ఫస్టాఫ్ లో చాలా
పాత్రలు ఉండటంతో కొంత గందరగోలంగా ఉంటుంది.

తీర్పు: స్క్రీన్ప్లే ఇంకా బావుండి, సెకండాఫ్ కూడా బాగా తీఎసి ఉంటె బెటర్ గా ఉండేది.

కొస మెరుపు: సినిమాలో పాత్రలకి, ప్రదేశాలకి తెలుగు పేర్లు పెట్టినప్పటికీ, సినిమా అంత తమిళనాడు తీసినట్లుగా తెలిసిపోతుంది. పాత్రల ప్రవర్తన వారి భాష తమిళ నేటివిటీకి దగ్గరగా ఉంటాయి.

అశోక్ రెడ్డి . ఎం

123తెలుగు.కాం రేటింగ్: 2 .75/5

Sangharshana Review For English Version

సంబంధిత సమాచారం :

X
More