సమీక్ష : వైరస్ – ఎఫెక్ట్ చూపించలేకపోయింది !

Virus movie review

విడుదల తేదీ : జూన్ 30, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

దర్శకత్వం : ఎస్.ఆర్. కృష్ణ.

నిర్మాతలు : సలీం ఎండి, శ్రీనివాస్ మంగళ

సంగీతం : మీనాక్షి, సునీల్ కశ్యప్.

నటీనటులు : సంపూర్ణేష్ బాబు, వెన్నెల కిషోర్, గీతా షా, నిదిషా

సంపూర్నేష్ బాబు సినిమా అంటే తెలుగులో ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ప్రేక్షకుల్లో ఆయన సినిమాలకు వెళితే కాసేపు నవ్వుకోవచ్చనే నమ్మకం ఉంది. సంపూర్ణేష్ బాబు మేనరిజమ్స్, ఆయన స్టైల్ అంటే ఇష్టపడే వారి కోసం ఆయన చేసిన తాజా చిత్రం వైరస్ ఈరొజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి సినిమాతో సంపూ ఏ స్థాయి ఎంటర్టైన్మెంట్ పంచాడో ఇప్పుడు తెలుసుకుందాం.

కథ :

కిట్టు(సంపూర్ణేష్ బాబు)కంప్యూటర్ ఇంజనీరింగ్ లో యూనివర్సిటీ టాపర్ గా నిలిచినా ఆర్ధిక స్తోమత సరిగా లేకపోవడం మాస్టర్ డిగ్రీ చేయలేక ఓ కాఫీ షాప్ లో పని చేస్తాడు. అయితే అతని టాలెంట్ తెలిసి ఓ స్వచ్చంద సంస్థ నడుపుతున్న అమ్మాయి అనన్య(నిదిషా) కిట్టుకి సాయం చేయడంతో అతను అమెరికా వెళ్లి మాస్టర్ డిగ్రీ చేసి అక్కడే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఇంతలో అనుకోకుండా తాను ఆ స్థాయికి చేరడానికి కారణం అయిన అనన్య ఆత్మహత్య చేసుకుంది అనే విషయం తెలుసుకొని, దానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవాలని ఇండియా వస్తాడు.

ఈ క్రమంలో అనన్య చనిపోయిన అపార్ట్ మెంట్ లో ఓ నెట్ వర్క్ ఆపరేటర్ గా ఉండి ఆమె డెత్ మిస్టరీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ మధ్యలో వైరస్ డాట్ కాం నుంచి అమ్మాయిల అశ్లీల వీడియోలు ఆన్ లైన్ లో పెడుతూ దారుణాలకు పాల్పడుతున్న వారికి అనన్య చావుకి మధ్య లింక్ ఉందని తెలుసుకున్న కిట్టు ఆ మిస్టరీని చేధించే ప్రయత్నం చేస్తాడు. ఇంతకి ఆ వైరస్ డాట్ కాంని ఎవరు నిర్వహిస్తున్నారు.? అమ్మాయిల మిస్టరీ డెత్స్ కి కారణం ఏంటి? ఈ కథలో దుర్గాప్రసాద్ ఎవరు? అనే విషయాలతో సినిమా నడుస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన ప్లస్ పాయింట్స్ అంటే అది సంపూర్ణేష్ బాబు. అతను తనదైన మేనరిజం, యాక్టింగ్ తో కథ మొత్తం నడిపించాడు. అలాగే సినిమాలో దర్శకుడు ఎంచుకున్న కథ కూడా ప్రస్తుతానికి తగ్గట్టే ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో సోషల్ మీడియా వలన ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని కథ ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు.

క్లైమాక్స్ లో సంపూతో చెప్పించిన డైలాగ్స్ నేటి వ్యవస్థలో ఉన్న లోపాలని ప్రతిబింబించే విధంగా ఉండి ఆకట్టుకున్నాయి. అలాగే వెన్నెల కిషోర్ యాక్టింగ్ తో పాటు, ఊహించని విధంగా సినిమాలో అతన్ని పాత్రని రీవీల్ చేసే విధానం ఆకట్టుకుంది. సినిమాలో హీరోయిన్ గా చేసిన గీతషా తన అందంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కమెడియన్స్ గా చమ్మక్ చంద్ర, వైవ హర్షలు వారి పాత్ర పరిధి మేరకు నవ్వించే ప్రయత్నం చేశారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాకి ప్రధాన మైనస్ అంటే కథనం. దర్శకుడు తాను చెప్పాలనుకున్న పాయింట్ ని చెప్పడానికి తయారు చేసుకున్న సన్నివేశాలు ఎక్కడా ఆకట్టుకునే విధంగా లేవు. మొదటి సగభాగం చూస్తున్నంత సేపు అసలు కథ ఎంటనే విషయం ఆడియన్ కి అస్సలు అర్ధం కాదు. సెకండ్ ఆఫ్ స్టార్ట్ అయ్యాక అసలు కథ మొదలుపెట్టి వేగంగా నడిపించే ప్రయత్నం చేసినా సన్నివేశాలు బలం లేకపోవడం వలన చాలా వరకు నిరాశ పరుస్తుంది. దాంతో పాటు రన్ టైం కూడా సినిమాకి ప్రధాన మైనస్.

సినిమాలో పాటలు సందర్భోచితంగా రాకుండా సడెన్ వచ్చి పోతూ ఉంటాయి. అలాగే సినిమాలో కామెడీ కోసం పెట్టిన ఘోస్ట్ ఎపిసోడ్ తో అసలు దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో ఎవరికీ అర్ధం కాదు. హీరో, హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ లవ్ ట్రాక్ లో అటు రొమాన్స్ కాని, ఇటు లవ్ గాని ప్రేక్షకులకి కనిపించదు. ఒకాదానితో ఒకటి సంబంధం లేకుండా సాగిపోయే సన్నివేశాలు ఆద్యంతం ప్రేక్షకుడుకి అసహనం కలిగిస్తాయి.

సాంకేతిక విభాగం :

దర్శకుడు కృష్ణ సినిమా ద్వారా ప్రస్తుతం సోషల్ మీడియా వలన జరిగే అనర్దానలని చెప్పాలనుకున్న ప్రయత్నం కాస్తా మెచ్చుకోవాల్సిన విషయం. అయితే దాని కోసం ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే ప్రేక్షకులని పూర్తిగా నిరాశ పరిస్తుంది. సినిమాలో డైలాగ్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. మ్యూజిక్ డైరెక్టర్ గా సునీల్ కశ్యప్ సినిమాకి కాస్తా మైనస్ అని చెప్పుకోవాలి. అటు పాటలు, ఇటు బ్యాగ్రౌండ్ స్కోర్ రెండు విషయాల్లో ఆయన విఫలం అయ్యాడనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఉన్నంతలో భాగానే ఉంటుంది. ఇక ఎడిటింగ్ అంటే సినిమాలో చాలా సన్నివేశాలకి కత్తెర వేయొచ్చు. నిర్మాణ విలువలు ఉన్నంతంలో బాగానే ఉన్నాయి.

తీర్పు :

మొత్తం మీద సంపూర్ణేష్ బాబు చేసిన ఈ చిత్రం నిరుత్సాహపరిచేదిగానే ఉంది. ఎంచుకున్న పాయింట్ బాగానే ఉన్నా కథనం మాత్రం రొటీన్ గా, చప్పగా ఉంది. ఖాళీ సమయం దొరికి, సంపూర్ణేష్ బాబు అందించే వెరైటీ తరహా ఎంటర్టైన్మెంట్ ను చూడటానికి ఇష్టపడే వారు ఒకేసారి ఈ సినిమాను చూడొచ్చు కానీ మిగతా రెగ్యులర్ మూవీ లవర్స్ మాత్రం ఈ వైరస్. కామ్ కు కాస్త దూరంగా ఉండటమే మంచిది .

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click here for English Review