మిమ్మల్ని తెగ నవ్వించడానికి వస్తున్న ‘ఎక్స్ట్రా జబర్దస్త్’

మిమ్మల్ని తెగ నవ్వించడానికి వస్తున్న ‘ఎక్స్ట్రా జబర్దస్త్’

Published on Sep 18, 2014 12:00 PM IST

మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిన ఎన్నో ప్రోగ్రామ్స్ బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఎంటర్టైన్ చేసాయి, చేస్తున్నాయి కూడా.. బుల్లితెర ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్విన్చాలనే ఉద్దేశంతో మల్లెమాల ప్రాంభించిన రియాలిటీ కామెడీ షో ‘జబర్దస్త్’. ‘ది అన్ లిమిటెడ్ కామెడీ ఎంటర్టైనర్’ అనే ట్యాగ్ లైన్ తో ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయంగా ,మొదలైన ఈ షో తెలుగు ప్రజానీకం నుండి అశేష ఆదరణ పొందింది. అందుకే గురువారం సాయంత్రం అయ్యిందంటే ఎప్పుడు రాత్రి 9:30 నిమిషాలు అవుతుందా జబర్దస్త్ ప్రోగ్రాం చూద్దామా అని ఎదురు చూస్తుంటారు. ఇలా సంవత్సరంపైగా నవ్విస్తున్న తెలుగు బుల్లితెర ప్రేక్షకులను మరింత నవ్వించడం కోసం ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ ప్రోగ్రాంతో మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తోంది..

ఇప్పటి వరకూ గురువారం మాత్రమే ప్రసారం అవుతున్న ‘జబర్దస్త్’ కి సీక్వెల్ గా వారంలో మరొక రోజు మీరు బాగా నవ్వుకోవడానికి వస్తున్న షో ‘ఎక్స్ట్రా జబర్దస్త్’. ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ లో కూడా నాగ బాబు, రోజాలే జడ్జ్ లుగా ఉంటారు. కానీ కొత్త పార్టిసిపెంట్స్ ఫ్రెష్ స్కిట్స్ తో మిమ్మల్ని మరింత నవ్వించడానికి వస్తున్నారు. ఈ నవ్వుల ఎక్స్ ప్రెస్ సీక్వెల్ లో జబర్దస్త్ లో కంటే మోర్ ఫన్, మోర్ కామెడీ, మోర్ పంచ్ డైలాగ్స్ ఉంటాయి. ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రాం మీ ఈ టీవీలో ప్రతి శుక్రవారం రాత్రి 9:30 గంటలకి ప్రసారం కానుంది. ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనే విషయాన్ని త్వరలోనే తెలియజేస్తాం.. సో ఫ్రెండ్స్ .. గెట్ రెడీ ఫర్ మోర్ ఫన్ అండ్ మోర్ ఎంటర్టైన్మెంట్..

‘ఎక్స్ట్రా జబర్దస్త్’ ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు