పలు దేశాల్లో రికార్డ్ స్థాయిలో విడుదలకానున్న ‘భరత్ అనే నేను’ !

పలు దేశాల్లో రికార్డ్ స్థాయిలో విడుదలకానున్న ‘భరత్ అనే నేను’ !

Published on Apr 19, 2018 2:47 PM IST

‘భరత్ అనే నేను’ చిత్రం అమెరికాలో 2000 ప్రీమియర్ షోల ద్వారా ప్రదర్శితంకానున్న సంగతి తెలిసిందే. అది కాకుండా ఇంకొన్ని దేశాల్లో సైతం సినిమా ఇంతవరకు ఏ తెలుగు చిత్ర విడుదలకాని స్థాయిలో రిలీజ్ కానుంది. ఒక్కసారి ఆయా దేశాల వివరాలు చూస్తే ఈ కింది విధంగా ఉన్నాయి.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో కలిపి 50 లొకేషనల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా యూకేలో 28 లొకేషన్లు, కెనడాలో 8, సింగపూలో 4, 18 యూరప్ దేశాల్లో కలిపి 36 లొకేషన్లు, 11 ఆఫ్రికన్ దేశాల్లో కలిపి 26, ఫిలిప్పైన్ లో 4, హాంగ్ కాంగ్లో 1, మలేషియాలో 7, థాయిలాండ్ లో 1, సూడాన్ లో 1, గల్ఫ్ దేశాల్లో 34 లొకేషన్లలో విడుదలకానుంది. అమెరికాలో కాకుండా ఇతర దేశాల్లో ఈ స్థాయిలో విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు