‘ధృవ’ 5 రోజుల షేర్ వివరాలిలా ఉన్నాయి !
Published on Dec 15, 2016 1:09 pm IST

dhruva-3rd
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ధృవ’ 9వ తేదీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. ఒకవైఫు కరెన్సీ బ్యాన్ ప్రభావం తీవ్రంగా నడుస్తున్నా కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్లనే రాబట్టింది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణాల్లో మెగా అభిమానులు, సినీ అభిమానులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. చరణ్ సిక్స్ ప్యాక్ లుక్, అద్భుతమైన పోలీస్ స్టోరీ లైన్, సురేందర్ రెడ్డి రిచ్ మేకింగ్, రామ్ చరణ్, అరవింద స్వామిల నటన వంటివి ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణలుగా నిలిచి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 5 రోజుల షేర్ వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి …

ప్రాంతం
కలెక్షన్స్ (షేర్-రూపాయల్లో)
నైజాం 10.24 కోట్లు
సీడెడ్
4.92 కోట్లు
ఉత్తరాంధ్ర
3.74 కోట్లు
పశ్చిమ గోదావరి
1.99 కోట్లు
తూర్పు గోదావరి
2.28 కోట్లు
కృష్ణా
2.11 కోట్లు
గుంటూరు
2.49 కోట్లు
నెల్లూరు
94 లక్షలు
మొత్తం
28.71 కోట్లు

 
Like us on Facebook