విష్ణు కెరీర్ లో ‘ఎర్రబస్సు’ బెస్ట్ ఫిల్మ్ అవుతుంది – దాసరి

విష్ణు కెరీర్ లో ‘ఎర్రబస్సు’ బెస్ట్ ఫిల్మ్ అవుతుంది – దాసరి

Published on Oct 22, 2014 3:08 PM IST

errabasuu

దాసరి నారాయణరావు, మంచు విష్ణు తాతా మనవళ్ళుగా నటిస్తున్న సినిమా ‘ఎర్రబస్సు’. మూడేళ్ళ విరామం తర్వాత దాసరి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. తారక ప్రభు ఫిల్మ్స్ పతాకంపై స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు. కాథరిన్ త్రేసా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు చక్రి సంగీతం అందించారు. ఈ నెల 31న ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు. ఈ సందర్భంగా దాసరి సినిమా విశేషాలను తెలియజేయటానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విష్ణు, చక్రి, రేలంగి నరసింహారావు, రాజేంద్ర కుమార్ పాల్గొన్నారు.

దాసరి మాట్లాడుతూ… ‘ఎర్రబస్సు’ నా 151వ సినిమా. తాతామనవళ్ళకు చెందిన కథతో రూపొందింది. చదువురాని పల్లెటూరి తాతగా నేను, అమెరికా వెళ్లాలనుకునే సాఫ్ట్ వేర్ మనవడిగా విష్ణు నటించాం. తాతను సంతోషంగా ఉంచాలని హైదరాబాద్ తీసుకొచ్చిన మనవడి కథ. పెర్ఫార్మన్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ఉన్న కథ. విష్ణు అద్బుతంగా నటించాడు. అతని కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ సినిమాలలో ఇది కూడా ఒకటి అవుతుంది. ఫస్ట్ టైం చక్రితో కలసి పని చేస్తున్నాను. 6 సాంగ్స్ తో పాటు, ఒక బిట్ సాంగ్ కంపోజ్ చేశాడు. కీరవాణి ఓ పాట పాడారు. ఈ నెల 31న ఆడియో, నవంబర్ 14న సినిమా విడుదల చేస్తున్నాం. అని దాసరి తెలిపారు. ‘ఎర్రబస్సు’ అంటే అందరూ చాలా చులకనగా చూస్తారు. ‘ఎర్రబస్సు’ ఎక్కి వచ్చి ఎర్రకోట మీద జండాలు ఎగరేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. అని దాసరి వ్యాఖ్యానించారు.

విష్ణు మాట్లాడుతూ.. అద్బుతమైన కథ ఇది. మిగతా విషయాలు ఆడియో వేడుకలో మాట్లాడతాను అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు