శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘గురు’

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘గురు’

Published on Sep 23, 2016 6:10 PM IST

guru
‘బాబు బంగారం’ వంటి విజయం తరువాత హీరో విక్టరీ వెంకటేష్ బాలీవుడ్ చిత్రం ‘సాలా ఖదూస్’ ను తెలుగులో ‘గురు’ పేరుతో రీమేకేచేసే పనిలో ఉన్నారు. దీనికి కోసం ఇప్పటికే వెంకీ కసరత్తులు కూడా చేసి బాడీపెంచాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం తాలూకు ఫస్ట్ లుక్ కు విశేషమైన స్పందన లభించింది. దీంతో సినిమాపై అంచనాలు కూడా బాగానే పెరిగాయి. చిత్ర బృందం కూడా షూటింగ్ ను శరవేగంగా కంప్లీట్ చేస్తోంది.

కొద్దిరోజుల క్రితమే వైజాగ్ లో మొదలుపెట్టిన మొదటి షెడ్యూల్ పూర్తి చేసి మరో కొత్త షెడ్యూల్ కోసం ఊటీ వెళ్లనున్నారు టీమ్. నవంబర్ కల్లా షూటింగ్ పూర్తిచేసి సినిమాని డిసెంబర్ కానుకగా విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాని కూడా ఒరిజినల్ వర్షెన్ డైరెక్ట్ చేసిన సుధా కొంగర తెరకెక్కిస్తుండగా రితికా సింగ్ తాను హిందీ,తమిళంలో పోషించిన పాత్రను మరోసారి తెలుగులో చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు