ఇంటర్వ్యూ : కార్తీ – ‘బాహుబలి’ చూశాక 2 నెలలపాటు షూటింగ్ ఆపేశాం!

ఇంటర్వ్యూ : కార్తీ – ‘బాహుబలి’ చూశాక 2 నెలలపాటు షూటింగ్ ఆపేశాం!

Published on Oct 25, 2016 10:00 PM IST

karthi
‘ఆవారా, యుగానికొక్కడు, ఊపిరి’ వంటి చిత్రాలతో తమిళ నటుడు కార్తీ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. ఆయన తాజాగా నటించిన కాష్మోరా అనే సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి అక్టోబర్ 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో పంచుకున్న విశేషాలు..

ప్ర) సినిమాలో మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి ?

స) సినిమాలో మొత్తం రెండు పాత్రలుంటాయి. వాటిలో ఒకటి పిరియాడికల్ పార్ లో వచ్చే రాజ్ నాయక్ పాత్ర కాగా, రెండవది ప్రెసెంట్ లో వచ్చే కాష్మోరా పాత్ర.

ప్ర) అసలు సినిమా కథ ఎలా ఉంటుంది ?

స) సినిమా మొదట కమర్షియల్ యాంగిల్ లోనే మొదలవుతుంది. ఆ తరువాత ఫ్లాష్ బ్యాక్ లో 500 ఏళ్ళు వెనక్కి వెళ్ళాక అక్కడ మరో కథ మొదలవుతుంది. ఇందులో ఒక్క రొమాన్స్ తప్ప, హర్రర్, కమర్షియల్ ఎలిమెంట్స్, కామెడీ అన్నీ ఉంటాయి. మొత్తం ఫ్యామిలీ వెళ్లి ఎంజాయ్ చేసే సినిమా.

ప్ర) రాజ్ నాయక్ పాత్ర కోసం ఎలా కష్టపడ్డారు ?

స) రాజ్ నాయక్ పాత్రకి అన్నింటికంటే ముఖ్యమైనది మేకప్. అందుకే మేకప్ కు ఎక్కువ టైం పట్టేది. ఇందులో రాజ్ నాయక్ ఒక సీన్ లో వేసుకున్న డ్రెస్ మరో సీన్ లో వేసుకోడు. ప్రతి సీన్ కి కొత్త కాస్ట్యూమ్ కావాలి. మేకప్ కి మూడున్నర గంటలు పట్టేది. అంత పర్ఫెక్ట్ గా ఈ పాత్రను డిజైన్ చేశాడు డైరెక్టర్ గోకుల్. రాజ్ నాయక్ పాత్ర చాలా కాంన్ఫిడెంట్ గా, డిఫరెంట్ గా ఉంటుంది.

ప్ర) ‘బాహుబలి’ స్థాయిలో ఈ సినిమా ఉంటుందా?

స) బాహుబలితో ఈ సినిమాని పోల్చి చూడొద్దు. ఈ సినిమాకు, ఆ సినిమాకూ చాలా తేడాలున్నాయి. బాహుబలికి రెండేళ్ల ముందరే ఈ కథ అనుకున్నాం. కానీ బాహుబలి చూశాక సినిమా షూట్ రెండు నెలలు ఆపేసి ఫుల్ హోమ్ వర్క్ చేసి మాకున్న తక్కువ బడ్జెట్ లోనే ఆ సాండర్డ్స్ ని అందుకోవడానికి ట్రై చేశాం.

ప్ర) డైరెక్టర్ గురించి చెప్పండి ?

స) డైరెక్టర్ ఇంతకు ముందు రెండు సినిమాలే చేశాడు. కానీ అతను కథ చెప్పిన విధానం నచ్చి నేను ఒప్పుకోవడంతో పాటు మిగతావారిని కూడా ఒప్పించాను. డైరెకర్ చాలా ఇంటెలిజెంట్. ప్రతి సన్నివేశం చాలా పెర్ఫెక్ట్ గా చేశాడు.

ప్ర) విజువల్ ఎఫెక్ట్స్ గురించి ?

స) ఇందులో 30 – 45 నిమిషాల పాటు అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బాహుబలి తరువాత ఆ స్థాయిని అందుకోడానికి బాహుబలికి పని చేసిన టీమ్ తోనే విజువల్ ఎఫెక్ట్స్ చేయించాం. అన్నీ చాలా బాగా వచ్చాయి.

ప్ర) నయనతార ఈ సినిమాకి అంత ఈజీగా ఎలా ఒప్పుకున్నారు ?

స) నయనతార ఇంతకు ముందెప్పుడూ ప్రిన్సెస్ తరహా పాత్ర చేయలేదు. దీంతో చెప్పగానే చాలా త్వరగా ఒప్పుకుంది. ఆమె పాత్ర కూడా చాలా బాగుంటుంది.

ప్ర) మీ కెరీర్లో ఇదే బిగ్ రిలీజ్ కదా ?

స) అవును. తెలుగు రాష్ట్రాల్లో 600 స్క్రీన్స్ లో, వరల్డ్ వైడ్ గా 2000 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతోంది.

ప్ర) రాజ్ నాయక్ పాత్ర కోసం ఏమైనా హోమ్ వర్క్ చేశారా?

స) అవును చాలా చేశా. ముందుగా బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ మార్చుకున్నా. తరువాత హార్స్ రైడింగ్ నేర్చుకున్నా. కాష్మోరా పాత్రకి 15 రోజుల్లో షూటింగ్ అయిపోతే సెకండ్ పార్ట్ లో దీనికి మాత్రం 100 రోజులు పట్టింది.

ప్ర) ఈ పాత్రకు మీకందిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏమిటి ?

స) షూటింగ్ జరిగేటప్పుడు యాక్టర్ వివేక్ గారు నాతో మాట్లాడుతూ.. ’30 సినిమాల తరువాత చేయాల్సిన సినిమాని నువ్వు 13 సినిమాలకే చేస్తున్నావయ్యా’ అన్నారు. అది నాకు చాలా బెస్ట్ కాంప్లిమెంట్. తరువాత 80 ఏళ్ళ వయసున్న మేకప్ ఆర్టిస్ట్ ఒకరు ’ఎప్పుడో ఎంజీఆర్ లాంటి వారికి ఇలాంటి మేకప్ చేశా, మళ్ళీ మీకే చేస్తున్నా’ అన్నారు. అది చాలా గర్వాంగా అనిపించింది.

ప్ర) సినిమా చేసేటప్పుడు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయం వేయలేదా ?

స) సినిమా చేసేటప్పుడు జనాలకు నచ్చుతుందా లేదా అని భయం వేసింది. కానీ గోకుల్ డైరెక్షన్, పివిపి గారి డెడికేషన్ చూశాక ధైర్యమొచ్చింది. చివరికి అవుట్ పుట్ చూశాకా కచ్చితంగా జనాలకు నచ్చుతుందన్న నమ్మకం కలిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు