భారీగా తెరకెక్కబోతున్న కళ్యాణ్ రామ్ సినిమా !

భారీగా తెరకెక్కబోతున్న కళ్యాణ్ రామ్ సినిమా !

Published on Feb 19, 2018 9:08 PM IST

కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ఎం.ఎల్. ఏ , నా నువ్వే సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక పవన్ సాధినేని దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. భారీ బడ్జెట్ తో స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కబోయే ఈ సినిమా ఏప్రిల్ రెండో వారంలో ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ ఈ సినిమాను స్వయంగా నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.

గ్రాఫిక్ ఈ సినిమాలో ప్రధానంగా ఉండబోతున్నాయని సమాచారం. గుణ్ణం గంగరాజు ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించబోతున్నాడు. దాదాపు ఏడాది నుండి స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా పక్కా ప్లానింగ్ తో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. కథ నచ్చడంతో కళ్యాణ్ రామ్ ఈ సినిమా నిర్మాణ భాద్యతలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు