పవన్ కళ్యాణ్ తో అబ్బాయి పోటి లేనట్లే..!

పవన్ కళ్యాణ్ తో అబ్బాయి పోటి లేనట్లే..!

Published on Nov 23, 2014 3:07 AM IST

Mukunda
మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ముకుంద’. సంక్రాంతికి బాబాయి పవన్ నటించిన ‘గోపాల గోపాల’ విడుదలవుతుందని ప్రకటించడంతో అబ్బాయి కొంచం ముందుకు జరిగాడు. మొదట అనుకున్నవిధంగానే డిసెంబర్ నెలాఖరున క్రిస్మస్ సమయంలో ‘ముకుంద’ సినిమాను విడుదల చేస్తున్నారు. డిసెంబర్ మొదటివారంలో ఆడియోను విడుదల చేసి, నెలాఖరున సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అబ్బాయి – బాబాయిల సినిమాల ఒకేసారి విడుదలైతే ఏ సినిమాకు ప్రాముఖ్యత ఇవ్వాలి..? అని మదనపడుతున్న మెగా అభిమానులకు ఈ వార్త సంతోషం కలిగించే అంశమే.

వరుణ్ తేజ్ సరసన హెడ్గే జంటగా నటిస్తున్న ఈ సినిమాకు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె’ ఫేం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. మిక్కి జె మేయర్ సంగీత దర్శకుడు. ఠాగూర్ మధు సమర్పణలో లియో ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) ‘ముకుంద’ను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు