సుకుమార్ ప్రయత్నంలో ఒక భాగమవుతున్నానన్న ఎన్టీఆర్ !


దర్శకుడు సుకుమార్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న సినిమా ‘దర్శకుడు’. హరి ప్రసాద్ దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన ఈ చిత్రం యొక్క టీజర్ కొద్దిసేపటి క్రితమే లాంచ్ అయింది. స్టార్ హీరో, సుకుమార్ కు అత్యంత ఆప్తుడు జూ. ఎన్టీఆర్ ప్రత్యేక అతిధిగా విచ్చేసి టీజర్ ను లాంచ్ చేశారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘నేనిక్కడికి వచ్చినప్పటి నుండి అందరూ నాకు థ్యాంక్స్ చెప్తున్నారు. కానీ సుకుమార్ అంటే నా గుండెకు దగ్గరైన వ్యక్తి. ఆయన ప్రయత్నంలో నేనూ ఒక భాగమవుతున్నాననుకుని ఇక్కడికి వచ్చాను’ అన్నారు.

అలాగే దర్శకుడు అనే సినిమాతో దర్శకుడిగా పరిచయవుతున్న హరి ప్రసాద్ కు నా శుభాకాంక్షలు. కథకు ఆస్కారమిస్తూ కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడానికి సుకుమార్ రైటింగ్స్ పేరుతో సుకుమార్ చేస్తున్న ప్రయత్నం చాలా మంచిది అన్నారు. ఇకపోతే ఈ చిత్రంతో నూతన నటుడు అశోక్ హీరోగా పరిచయమవుతున్నాడు.

 

Like us on Facebook