ఎన్టీఆర్ తరువాతి చిత్రం గురించిన ఆసక్తికర విషయం !

ఎన్టీఆర్ తరువాతి చిత్రం గురించిన ఆసక్తికర విషయం !

Published on Jan 24, 2017 1:50 PM IST

NTR
యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకుని ఉత్సాహంగా తరువాతి చిత్రానికి సిద్ధమవుతున్నాడు. ఎన్టీఆర్ తరువాతి చిత్రంలో బాబీ దర్శకత్వం లో నటించనున్నాడు.ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

ఎన్టీఆర్ రీసెంట్ గా ఓ ఫిలిం మ్యాగజైన్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలను ఎన్టీఆర్ వెల్లడించారు. వత్తిడి సమయాల్లో కుకింగ్ చేయడం ద్వారా తాను రిలాక్స్ అవుతానని ఎన్టీఆర్ వెల్లడించాడు. షూటింగ్ లేని సమయాల్లో తాను కుకింగ్ చేస్తానని, తన కొడుకు కోసం షాపింగ్ కూడా చేస్తానని ఎన్టీఆర్ తెలిపారు. తన తదుపరి చిత్రం గురించి కూడా ఎన్టీఆర్ ప్రస్తావించాడు.ట్రెండ్ కు తగ్గట్లుగా మారాల్సిన సమయం ఇదని తనని అభిమానులు ఏవిధంగా కోరుకుంటున్నారో ఆవిధంగా కనిపిస్తానని ఎన్టీఆర్ అన్నారు. తరువాతి చిత్రంలో ఎన్టీఆర్ పూర్తిగా కొత్త లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు