పవన్ కంపోజ్ చేసిన ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్

పవన్ కంపోజ్ చేసిన ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్

Published on Jul 31, 2015 5:10 PM IST

sardar-pawan-kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తదుపరి సినిమా జూలై 29 నుంచి సెట్స్ పైకి వెళ్ళింది. ‘సర్దార్’ అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసిన ఈ సినిమా షూటింగ్ లో నేటి నుంచి పవన్ కళ్యాణ్ జాయిన్ అయ్యాడు. అంతే కాకుండా ఈ రోజే ఫేస్ రివీల్ చెయ్యకుండా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. ఆ ఫస్ట్ లుక్ ని పవన్ కళ్యానే చెప్పాడని ఈ చిత్ర నిర్మాత శరత్ మరార్ తెలియజేశాడు. ‘నేటి నుంచి పవన్ కళ్యాణ్ సర్దార్ షూట్ లో జాయిన్ అయ్యారు. ఎప్పటిలానే చూడటానికి డైనమిక్ అండ్ డాషింగ్ గా ఉన్నారు. సినిమా స్టార్ట్ అయిన కొద్ది రోజులకి ఫస్ట్ లుక్ రిలీజ్ చెయ్యడం అనేది కామన్ గా జరిగే విషయం కానీ పవన్ కళ్యాణ్ పర్సనల్ గా డిసైడ్ అయ్యి ఒక స్టిల్ ని కంపోజ్ చేసి దాన్ని షూట్ చేసి మొదటి రోజే రిలీజ్ చేయమన్నారు’ అని సోషల్ మీడియా లో తెలిపాడు.

ఈ రోజు ఉదయం రిలీజ్ అయిన ఈ ఫస్ట్ లుక్ అభిమానుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ స్టిల్ లో పవన్ ఫపేస్ కనిపించకపోయినా స్టిల్ లో తన పవర్ కనిపిస్తోందని ఫీల్ అవుతున్నారు. ఈ స్టిల్ లెఫ్ట్ లో పవన్ పోలీస్ డ్రెస్ లో బెల్ట్ కి పెట్టుకున్న తుపాకిని చూపించి లెఫ్ట్ లో తన గుర్రం తలని మధ్యలో గబ్బర్ సింగ్ చేతిలో దెబ్బలు తినబోయే విలన్స్ ని ఉంచారు. పవన్ అభిమానులను ఖుషీ చేయడం కోసం రిలీజ్ చేసిన స్టిల్ అందరిచేత అదుర్స్ అనిపించుకుంటోంది. పవర్ ఫేం బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మరాఠీ నటుడు శరత్ కేల్కర్ విలన్ గా కనిపించనున్నాడు. హీరోయిన్స్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు