కొత్త పుస్తకం రాయనున్న పవన్ కళ్యాణ్
Published on Sep 13, 2016 5:19 pm IST

pawan
సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో ఓ పుస్తకం రాయనున్నారు. స్వతహాగానే సాహిత్యాన్ని అమితంగా ఇష్టపడే పవన్ కు పుస్తకాలే జ్ఞానానికి మూలం అని నమ్ముతారు. అందుకే తన జనసేన పార్టీ సిద్ధాంతాలపై జనాలకు పూర్తి అవగాహన కల్పించేందుకు స్వయంగా ఓ పుస్తకాన్ని రూపందించాలని నిర్ణయించారు. ఈ పుస్తకంలో పార్టీ స్థాపించడానికి ఆయన్ను ప్రభావితం చేసిన పరిస్థితులు, పార్టీ వెనుకున్న ముఖ్య ఉద్దేశ్యాలు, సాదించాలనుకున్న ఆశయాలు వంటి వాటి గురించి క్లుప్తంగా తెలియజేయనున్నారు.

ఈ పుస్తకానికి ‘నేను – మనం – జనం’ అన్న పేరుతో పాటు ‘మార్పు కోసం యుద్ధం’ అనే ట్యాగ్ లైన్ ను నిర్ణయించారు. గతంలో కూడా పవన్ తన పార్టీ ఎజెండాను ప్రజలకు తెలపడానికి ‘ఇజం’ పేరుతో పుస్తకాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే తన అభిమాన కవి గుంటూరు శేషేంద్ర శర్మ రచించిన ‘ఆధునిక మహాభారతం’ అనే పుస్తకాన్ని కూడా రీప్రింట్ చేయించారు పవన్. ఇకపోతే ఈ పుస్తకాన్ని 2017 లో విడుదల చేయనున్నట్లు కూడా తెలుస్తోంది.

 

Like us on Facebook