చిరంజీవిని పర్సనల్ గా కలిసిన పవన్ కళ్యాణ్ !

చిరంజీవిని పర్సనల్ గా కలిసిన పవన్ కళ్యాణ్ !

Published on Jan 19, 2017 4:00 PM IST

pawan-chiru
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ మెగా ఫ్యామీలీకి ఎంత ప్రత్యేకమైందో వేరే చెప్పనక్కర్లేదు. ప్రాజెక్ట్ మొదలైన దగ్గర్నుంచి ఇప్పటి వరకు సినిమాకు సంబందించిన ప్రతి అంశంలోనూ మెగా కుటుంబ సభ్యులు పాలుపంచుకుంటూనే ఉన్నారు. సినిమా సక్సెస్ ను కూడా కుటుంబ సభ్యులంతా సాధారణ ప్రేక్షకుల్లానే ఎంజాయ్ చేశారు. 60 ఏళ్ల వయసులో కూడా అంత గొప్పగా నటించిన మెగాస్టార్ ను పొగడ్తలతో ముంచెత్తారు. మెగా అభిమానులైతే మెగా ఫ్యామిలీలో ముఖ్యడు పవన్ కళ్యాణ్ సినిమా పట్ల ఎలా స్పందిస్తాడో చూడాలని ఎంతో ఆతురతగా ఎదురు చూశారు.

పవన్ కూడా కొన్ని రోజుల క్రితమే ‘ఖైదీ నెం 150’ చిత్రాన్ని వీక్షించారు. కానీ వరుసగా కొన్ని రాజకీయపరమైన పనులు, ‘కాటమరాయుడు’ సినిమా షూటింగ్ ఉండటం వలన వెంటనే చిరంజీవిని కలవలేక నిన్న రాత్రి తీరిక చేసుకుని స్వయంగా ఇంటికి వెళ్లి అన్నయ్య చిరంజీవికి, నిర్మాతగా వ్యవహరించిన రామ్ చరణ్ కు, వదిన సురేఖకు శుభాకాంక్షలు తెలిపి సినిమాలోని పలు అంశాలను గురించి చిరంజీవితో ముచ్చటించినట్టు సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు