తమన్నాపై కేసు పెట్టిన నిర్మాత !

tamanna-67
స్టార్ హీరోయిన్ తమన్నా పై సినీ నిర్మాత ఒకరు కేసు పెట్టిన అంశం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే తమిళంలో శీను రామస్వామి దర్శకత్వంలో తమన్నా నటించిన ‘ధర్మ దురై’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అయితే విడుదలకు ముందు, ఆ తరువాత హీరోయిన్ తమన్నా సినిమాకి ముఖ్యమైన ప్రమోషన్లలో అస్సలు పాల్గొనలేదు. హీరో విజయ్ సేతుపతి మాత్రమే ప్రమోషన్లలో పాలగోన్నాడు. దీంతో నిర్మాత ఆర్కే సురేష్ కాస్త నొచ్చుకున్నారు.

పైగా తమన్నా తాను తాజాగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘అభినేత్రి’ కి మాత్రం తరచూ ప్రతి ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొంటోంది. దీంతో ఇంకాస్త కోపానికి గురైన నిర్మాత తమిళనాడు నడిగర్ సంఘంలో తమన్నాపై తన సినిమాకి ప్రమోషన్ చేయలేదంటూ పిర్యాదు చేశాడు. అయితే విచారణ జరపాల్సిన నడిగర్ సంఘం సెక్రటరీ విశాల్ తమన్నాతో కలిసి ‘కత్తి సందై’ చిత్రంలో నటిస్తున్నారు. దీంతో ఈ పిర్యాదు విచారం ఎలా జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Bookmark and Share