ఫ్యాన్స్ కి 2 సినిమాలు ఇస్తానన్న రామ్ చరణ్

ఫ్యాన్స్ కి 2 సినిమాలు ఇస్తానన్న రామ్ చరణ్

Published on Jan 25, 2015 9:42 PM IST

Ram-Charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు తన అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయే ఒక మాట చెప్పాడు. అదేమిటంటే ఈ సంవత్సరం రెండు సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాడని తెలపడం. ఈ రోజు ఉదయం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ లో జరిగిన ఓ ఈవెంట్ లో తన అభిమానులతో మాట్లాడుతూ ‘ఈ సంవత్సరం కూడా రెండు సినిమాలు రిలీజ్ చేస్తానని’ తెలిపాడు. గత సంవత్సరం రామ్ చరణ్ ఎవడు, గోవిందుడు అందరివాడేలే సినిమాలతో విజయాలను అందుకున్నాడు.

రామ్ చరణ్ తదుపరి సినిమా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఉంటుంది. ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ప్రస్తుతానికి ఈ సినిమాకి ‘నా పేరే రాజు’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. శ్రీను వైట్ల అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా ఉండేలా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. శ్రీను వైట్ల సినిమా పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ఈ రెండు సినిమాలను ఈ సంవత్సరంలోనే రిలీజ్ చెయ్యడానికి చరణ్ ప్లాన్ చేసాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు