రుద్రమదేవి ట్రైలర్‌ : రెండు రోజుల్లో 10లక్షల వ్యూస్!

రుద్రమదేవి ట్రైలర్‌ : రెండు రోజుల్లో 10లక్షల వ్యూస్!

Published on Mar 5, 2015 6:20 PM IST

rudramadevi
గుణశేఖర్ కలల ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న సినిమా.. రుద్రమదేవి. ఈ సినిమాలో రుద్రమదేవి పాత్రను అనుష్క పోషిస్తుండగా, మరో ప్రధాన చారిత్రక గోనగన్నారెడ్డి పాత్రను హీరో అల్లు అర్జున్ పోషిస్తున్నారు. హీరో రానా, నిత్యామీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా యూట్యూబ్‌లో విడుదల చేసిన రుద్రమదేవి ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే 10 లక్షలకు పైగా వ్యూస్‌ని సాధించింది. ఈ ట్రైలర్‌లో అల్లు అర్జున్, అనుష్కలు ఆకట్టుకుంటున్నారు. ఇక అల్లు అర్జున్ గెటప్ దగ్గరనుంచి పోరాట సన్నివేశాలు, ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్నీ ఆకట్టుకుంటున్నాయి. భారతదేశ సినీ పరిశ్రమలో మొదటిసారిగా స్టీరియోస్కోపిక్ త్రీడీ టెక్నాలజీతో బయోపిక్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 2న సాయంత్రం 6గంటలకు విడుదల చేశారు. భారీ సెట్టింగులతో, విజువల్ ఎఫెక్ట్స్‌తో ట్రైలర్‌ను ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. గుణ టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమౌతోంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు