టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్‌బాబు ప్రధాన పాత్రలో, డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారకా దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం హరోం హర. ది రివోల్ట్ అనేది ఉప శీర్షిక. మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ను మే 31, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
ఇదే విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. సుధీర్ బాబు డబ్బింగ్ చెబుతున్న చిన్న వీడియో ను రిలీజ్ చేశారు. 1989 బ్యాక్ డ్రాప్‌లో చిత్తూరులోని కుప్పం నేపథ్యంలో సాగే స్టోరీతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం కి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
ఈ కిత మన కుప్పం యాస తో వస్తాండాడు సుబ్రహ్మణ్యం, సూస్కోండా…
" ఇంగ సెప్పేదేం లేదు, సేసేదే ????❤????"
Done with the dubbing of #HaromHara????️???? #HaromHaraOnMay31st@ImMalvikaSharma @gnanasagardwara @SumanthnaiduG @chaitanmusic @jungleemusicSTH @SSCoffl pic.twitter.com/5EYdRjeCNs— Sudheer Babu (@isudheerbabu) May 4, 2024