వెట్టైయాన్ మూవీ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్!

వెట్టైయాన్ మూవీ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్!

Published on May 5, 2024 2:00 AM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ గతేడాది జైలర్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. చివరిసారిగా లాల్ సలాం అనే మూవీ లో గెస్ట్ రోల్ లో కనిపించారు. ఇప్పుడు ఆయన వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అందులో టి.జే. జ్ఞానవేల్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న వెట్టైయాన్ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ చిత్రం కి సంబందించిన ముంబై షూటింగ్ షెడ్యూల్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం ఇప్పటి వరకూ దాదాపు 80 శాతం కి పైగా షూటింగ్ పూర్తి అయినట్లు సమాచారం. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు. రానా దగ్గుపాటి మరొక కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు