రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) చివరిసారిగా సలార్ చిత్రం లో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడం జరిగింది. ప్రభాస్ తదుపరి కల్కి 2898AD చిత్రం లో కనిపించనున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ పాన్ వరల్డ్ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆయితే హీరో ప్రభాస్ గురించి టాలీవుడ్ స్టార్ యాక్టర్ అయిన రానా దగ్గుబాటి ఒక ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రభాస్ గురించి మాట్లాడుతూ, ‘ప్రభాస్ ఇంతసేపు మాట్లాడడు, 5 మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతాడు. గొప్ప పనులు చేయడానికి ఇష్టపడతాడు. సింపుల్ గా, హంబుల్ హ్యూమన్ బీయింగ్ గా ఉంటాడు అని అన్నారు. రానా దగ్గుపాటి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ తో బాహుబలి సిరీస్ చిత్రాల్లో భల్లాల దేవ పాత్రలో నటించారు రానా. బాహుబలి 2 ఇండియన్ ఇండస్ట్రీ హిట్ మూవీ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే.