‘రోబో 2’లో రజనీ, షారూఖ్..?

‘రోబో 2’లో రజనీ, షారూఖ్..?

Published on May 26, 2015 4:57 PM IST

rajinikanth-sharukh

శంకర్, రజనీకాంత్‌ల క్రేజీ కాంబినేషన్లో రూపొంది సౌత్ ఇండియాలో ఓ ట్రెండ్ సెట్ చేసిన గ్రాఫికల్ వండర్ ‘రోబో’. 2010లో విడుదలైన ఈ సినిమా ఇండియన్ సినిమా మార్కెట్‌ ఏ స్థాయిదో తెలియజేసింది. ఆ సినిమాకు సీక్వెల్ రూపొందించాలన్న ఆలోచన ఎప్పట్నుంచో ఉండగా తాజాగా అది కార్యరూపం దాల్చనుంది. ఈ సీక్వెల్‌కు సంబంధించిన ఆసక్తికర కథనాలు రోజుకొకటి హల్‌చల్ చేస్తూ సినిమా లాంచ్ కాకముందే విపరీతమైన హైప్ క్రియేట్ అయింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయమొకటి ప్రచారంలో ఉంది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కే ఈ సినిమాలో హిందీలో హీరోగా, తమిళంలో విలన్‌గా షారూఖ్ నటిస్తారని టాక్. అలాగే రజనీకాంత్ కూడా తమిళంలో హీరోగా, హిందీలో విలన్‌గా నటిస్తారట. మార్కెట్‌కు తగ్గట్టుగా ఈ రకంగా పాత్రలను మార్చడం కలిసివస్తుందని శంకర్ భావిస్తున్నారట. గతంలో మణిరత్నం ‘రావణ్’ సినిమాకు కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అయ్యారు. ప్రస్తుతం ఈ సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుందని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు