స్పెషల్ : సినిమాలపై సోషల్ మీడియా ప్రభావం ..

స్పెషల్ : సినిమాలపై సోషల్ మీడియా ప్రభావం ..

Published on Jul 12, 2014 9:29 AM IST

social

కొత్త సినిమా కబుర్లు, అభిమానులతో తారల ముచ్చట్లు, ఈ శుక్రవారం విడుదలైన సినిమా హిట్టా ఫట్టా, మన ఫేవరెట్ హీరో ఎం చేస్తున్నాడు..?
ఇలా ప్రతి విషయం గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా యువత సోషల్ మీడియా మీద ఆధారపడుతున్నారు. వెబ్ మీడియాలో వార్తలను ఫ్యాన్ పేజి, గ్రూప్ పేజిలలో షేర్లు, ట్వీట్లు కొడుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్.. & ఇంకొకటి. ప్రస్తుతం సోషల్ మీడియా సినిమాలపై చాలా ప్రభావం చూపుతుంది.

తెలుగు సినిమా ప్రముఖులు తమ అభిమానులతో టచ్’లో ఉండడానికి సోషల్ నెట్వర్కింగ్ సైట్లను ఎంచుకున్నారు. తన కొత్త సినిమా విడుదలైన ప్రతిసారి మహేష్ ట్విట్టర్లో ప్రత్యక్షం అవుతాడు. అలాగే తమపై వచ్చిన పుకార్లను ఖండించడానికి హీరోయిన్ల ఫస్ట్ ఆప్షన్ సోషల్ మీడియా. కాజల్ అగర్వాల్ స్పెషల్ సాంగ్ చేయడం లేదనే వార్త అయినా, సమంత గొడవ అయినా సోషల్ మీడియా నుండి వెలుగులోకి వచ్చినవే. ఈ శుక్రవారం విడుదలైన ‘దృశ్యం’ సినిమా రెండు రోజుల ముందు ప్రముఖులకు, విమర్శకులకు ప్రిమియర్ షోలు వేయడంతో ట్విట్టర్, పేస్ బుక్లలో తారలు తమ అభిప్రాయాలను పంచుకోవడంతో ప్రేక్షకులలో సినిమాపై ఆసక్తిని రేపింది. విడుదలకు ముందే హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమె. సినిమా విజయాలలో సోషల్ మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

సోషల్ నెట్వర్కింగ్ సైట్ల వలన కొన్ని సార్లు ప్రముఖులు చీత్కారాలు కూడా ఎదుర్కుంటున్నారు. ఆకతాయి అభిమానుల వేదింపులు అధికంగానే ఉంటున్నాయి. వీళ్ళ పోరు పడలేక అమలా పాల్ హనీమూన్ ఫోటోలు తీసేసింది. మిగతా తారలు కూడా ఏదో సందర్భంలో ఇబ్బంది పడ్డవారే. కొంతమంది హీరోల వ్యతిరేక గ్రూపులు కూడా సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. తమకు నచ్చనివారిపై బురద జల్లే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంచి, చెడు అనేవి ప్రతి రంగంలోను సహజం. మంచిని మాత్రమె గ్రహించి చెడును వదిలేయడం మంచిది.

భవిష్యత్లో సోషల్ మీడియా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల విషయంలో మరింత ప్రముఖ పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇప్పటి నుండే సినిమా ఇండస్ట్రీ దృష్టి వీటిపై సారించాల్సిన అవసరం ఉంది. ఆకతయిలను అరికట్టడానికి తగు చర్యలు తీసుకోవడానికి ఒక ప్రణాళిక కూడా రూపొందిస్తే బాగుంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు