Like us on Facebook
 
యూఎస్ లో ‘శ్రీరస్తు శుభమస్తు’ కు రెస్పాన్స్ ఎలా ఉంది ?

Srirastu-Subhamastu
‘అల్లు శిరీష్’ హీరోగా ‘పరశురామ్’ దర్శకత్వంలో ‘అల్లు అరవింద్’ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఏంతో హుందాగా నిర్మించిన చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’ నిన్న శుక్రవారం విడుదలై విమర్శకుల, ప్రేక్షకుల ప్రసంశలు అందుకుంటోంది. కొన్నాళ్లుగా హిట్ కోసం ప్రయత్నిస్తున్న శిరీష్ కు మంచి బ్రేక్ గా నిలిచిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే గాక ఓవర్సీస్ లోనూ పరవాలేదనిపించే ఆదరణ పొందుతోంది.

ఈ చిత్రం నిన్న శుక్రవారం యూఎస్ లో $ 7,936 వసూళ్లను రాబట్టి మొత్తం $ 14, 160 కలెక్ట్ చేసింది. సాధారణంగానే ఫ్యామిలీ, లవ్ ఎంటర్టైనర్లను ఆదరించే యూఎస్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని సైతం ఆదరిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్లాసిక్స్ ఎంటర్టైన్మెంట్స్ ఓవర్సీస్ లో విడుదల చేసింది. ‘థమన్’ సంగీతం అందించిన ఈ చిత్రంలో శిరీష్ సరసన ‘లావణ్య త్రిపాఠి’ హీరోయిన్ గా నటించింది.

Bookmark and Share