సుహాస్ కోసం “సలార్” మేకర్స్.!

సుహాస్ కోసం “సలార్” మేకర్స్.!

Published on Apr 25, 2024 1:57 PM IST


మన టాలీవుడ్ లో మంచి టాలెంట్ కలిగిన యువ నటుల్లో సుహాస్ కూడా ఒకడు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇప్పుడు మెయిన్ లీడ్ లో ఆసక్తికర కాన్సెప్ట్ ఉన్న సినిమాల్లో నటిస్తున్న తన నుంచి ఈ మే లో రిలీజ్ కి రాబోతున్న చిత్రమే “ప్రసన్నవదనం”. దర్శకుడు అర్జున్ వై కే తెరకెక్కించిన ఈ చిత్రం టీజర్ తోనే మూవీ లవర్స్ లో మంచి ఆసక్తి రేపింది. అయితే ఈ సినిమా రిలీజ్ కి మంచి డిమాండ్ కనిపిస్తుంది.

మన తెలుగులో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ ఎల్ ఎల్ పి వారు రిలీజ్ చేస్తుండగా కర్ణాటకలో ఈ చిత్రాన్ని “సలార్”, “కేజీయఫ్” సినిమా నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్ వారు రిలీజ్ చేస్తుండడం విశేషం. దీనితో సుహాస్ సినిమాకి మాత్రం మంచి రిలీజ్ నే రెండు రాష్ట్రాల్లో దక్కింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణన్ అలాగే రాశి సింగ్ తదితరులు నటిస్తుండగా విజయ్ బుల్గానిన్ సంగీతం అందించాడు అలాగే జె ఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు