విజయ్ సినిమా ఈ వారం లేనట్టే !

విజయ్ సినిమా ఈ వారం లేనట్టే !

Published on Oct 19, 2017 3:23 PM IST

ఇళయదళపతి విజయ్ నటించిన తాజా చిత్రం ‘మెర్సల్’ నిన్న ప్రపంచవ్యాప్తంగా విదుడాలి భారీస్థాయి ఓపెనింగ్స్ సాధించిన సంగతి తెలిసిందే. మొదట ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులో కూడా 18వ తేదీనే రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ తెలుగు వెర్షన్ సెన్సార్ పనులు ఆలస్యమవడంతో అది కాస్త ఈరోజు 19 కి వాయిదాపడింది. పోనీ రెండోసారి చెప్పిన ప్రకారం ఈరోజైనా రిలీజ్ చేశారా అంటే అదీ లేదు. ఇప్పటికీ సెన్సార్ పనులు పూర్తికాలేదు.

ఈ చిత్రాన్ని తెలుగులో ‘అదిరింది’ పేరుతో రిలీజ్ చేస్తున్న నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ విడుదలకు సిద్దంగానే ఉన్నా చెన్నైలో సెన్సార్ పూర్తికానందు వలన వెనక్కి తగ్గాల్సి వచ్చింది. సీనీ సర్కిల్స్ లో వినబడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా ఈ వారం విడుదలకావడం కష్టమేనని తెలుస్తోంది. ‘రాజా రాణి’ ఫేమ్ అట్లీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విజయ్ మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు