విడుదలకు సిద్దమైన ‘ఛలో’ ట్రైలర్ !

విడుదలకు సిద్దమైన ‘ఛలో’ ట్రైలర్ !

Published on Jan 17, 2018 11:00 AM IST

కొంత గ్యాప్ తర్వాత సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై నాగ శౌర్య చేస్తున్న చిత్రం ‘ఛలో’. ఆఖరి దశ పనుల్లో ఉన్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచగా ఇప్పుడు ట్రైలర్ కకూడా రాబోతోంది. ఈ నెల్ ఆ 8న అనగా రేపే ట్రైలర్ విడుదలకానుంది.

కన్నడ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఉషా ముల్పూరి, శంకర ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మించారు. నూతన దర్శకుడు వెంకీ కుడుములు డైరెక్ట్ చేస్తిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించారు. ఈ రొమాంటిక్ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్ తో సాలిడ్ హిట్ అందుకోవాలని భావిస్తున్నారు నాగ శౌర్య.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు