“కాంతారా” పై యంగ్ హీరో ఇంట్రెస్టింగ్ పోస్ట్.!

“కాంతారా” పై యంగ్ హీరో ఇంట్రెస్టింగ్ పోస్ట్.!

Published on Oct 22, 2022 4:00 PM IST

కన్నడ టాలెంటెడ్ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా అలాగే తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “కాంతారా”. కన్నడ సహా తెలుగులో కూడా భారీ హిట్ అయ్యిన ఈ చిత్రం ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రాన్ని తెలుగు కన్నడ భాషల్లో మంచి వసూళ్లు అందుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం పై యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు.

“నేను చిన్నప్పుడు మా ఊరిలో చూసిన కల్చర్ ని ఇప్పుడు తెరపై చూడడం చాలా బాగా అనిపించింది” అని తన రెస్పాన్స్ ని అయితే తెలిపాడు. మరి దీనితో అయితే ఈ సినిమాకి తన చిన్న నాటి పరిస్థితులకి మంచి లింక్ ఉందని కూడా చెప్పాలి. ఇక రీసెంట్ గా అయితే కిరణ్ నేను మీకు బాగా కావాల్సిన వాడిని చిత్రంతో అలరించాడు. ప్రస్తుతం మరిన్ని చిత్రాలతో తాను బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు