వైరల్ : విక్రమ్ నుంచి మరో ఐకానిక్ రోల్..!

వైరల్ : విక్రమ్ నుంచి మరో ఐకానిక్ రోల్..!

Published on Dec 10, 2022 10:02 AM IST

ఇండియన్ సినిమా దగ్గర నటన కోసం ఎంతవరకు అయినా వెళ్లగలిగే అతి కొద్ది మంది నటుల్లో ఎక్కువ శాతం మన సౌత్ నుంచే ఉండగా వారిలో అయితే తమిళ్ నుంచే చాలా మంది ఉన్నారని చెప్పొచ్చు మరి ఈ స్టార్స్ లో చియాన్ విక్రమ్ కోసం తెలిసిందే. తన కెరీర్ లో ఇప్పటివరకు నటన పరంగా ఎన్నో ఐకానిక్ రోల్స్, గెటప్స్ చేసి అవార్డు విన్నింగ్ పెర్ఫామెన్స్ ని తాను చేశారు.

ఇక రీసెంట్ గా అయితే “కోబ్రా” లో ప్రొస్థెటిక్ మేకప్ తో అనేక పాత్రలు చేయగా నెక్స్ట్ అయితే ఇప్పుడు వెర్సటైల్ దర్శకుడు పా రంజిత్ తో “తంగలాన్” అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో ఆల్రెడీ విక్రమ్ చేస్తున్న పాత్రని పరిచయం చేసారు. మరి లేటెస్ట్ గా అయితే మరో వర్కింగ్ స్టిల్ అయితే వైరల్ అవుతుంది. తన గెటప్ లో ఓ ఇంట్రెస్టింగ్ మార్పు చేస్తుండగా దీనితో అయితే మరోసారి విక్రమ్ నుంచి ఓ ఐకానిక్ రోల్ ని ఆశించవచ్చని ఆడియెన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు