కన్ఫ్యూజన్ లో పవన్ ఫ్యాన్స్.?

కన్ఫ్యూజన్ లో పవన్ ఫ్యాన్స్.?

Published on Dec 11, 2022 10:00 AM IST

గత కొన్ని రోజులు నుంచి టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ పై మంచి ఆసక్తి నడుస్తుంది. తాను ఇప్పటికే ఓకే చేసిన సినిమాలు కాకుండా నెక్స్ట్ కొత్త సినిమాలు రెండు అనౌన్స్ చేస్తారని తెలియడంతో అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ మరింత ఎక్కువ అయ్యింది. ఇక దీనిలో యంగ్ దర్శకుడు సుజీత్ తో ఓ మాసివ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగా ఇది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళింది.

ఇక నెక్స్ట్ మరో దర్శకుడు హరీష్ శంకర్ తో “భవదీయుడు భగత్ సింగ్” కాకుండా ఇంకో సినిమా అనౌన్స్ కావాల్సి ఉండగా దీనిపై కూడా ఆసక్తికర వాతావరణం నెలకొంది. అయితే ఇదిలా నడుస్తుండగానే ఈరోజు మైత్రి టీం నుంచి భవదీయుడు భగత్ సింగ్ కాస్తా “ఉస్తాద్ భగత్ సింగ్” గా మారి కొత్తగా అనౌన్సమెంట్ ఇచ్చారు.

అయితే ఇదంతా బాగానే ఉంది కానీ టైటిల్ లో చిన్న మార్పు చేసి అప్డేట్ ఇచ్చే దానికి కొత్త ప్రాజెక్ట్ లా అనౌన్స్ చేయడం ఏంటి అని అయితే చాలా మందిలో అనుమానం ఉండిపోయింది. దీనితో ఇది కొత్త ప్రాజెక్ట్ నా లేక లాస్ట్ టైం అనౌన్స్ చేసిన సినిమానేనా అనే కన్ఫ్యూజన్ లో అయితే పవన్ ఫ్యాన్స్ పడ్డారు కానీ ఈ కొత్త అనౌన్సమెంట్ తో కూడా ప్రస్తుతానికి ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు