బాలయ్య ‘అన్‌ స్టాపబుల్ 2’లో ముగ్గురు హీరోయిన్స్ !

బాలయ్య ‘అన్‌ స్టాపబుల్ 2’లో ముగ్గురు హీరోయిన్స్ !

Published on Dec 19, 2022 4:48 PM IST

బాలయ్య ‘అన్‌ స్టాపబుల్ 2’ షో మొదటి ఎపిసోడ్ గెస్ట్ గా చంద్రబాబు వచ్చాడు. ఆ ఎపిసోడ్ సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ప్రభాస్ ఎపిసోడ్ తాలూకు ప్రోమో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఈ ఎపిసోడ్ సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం అంటున్నారు. అలాగే ఈ టాక్ షోకి పవన్ కళ్యాణ్ కూడా గెస్ట్ గా రాబోతున్నాడని అన్ స్టాపబుల్ టీమ్ కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. అయితే, అలనాటి అందాల తారలు జయప్రద, జయసుధ చాలా రోజుల తర్వాత మళ్లీ కలిసి ఈ షోలో కనిపించబోతున్నారు.

బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్-2’ కొత్త ఎపిసోడ్ లో వీరిద్దరూ కలిసి పాల్గొంటున్నారు. అలాగే జయసుధ, జయప్రదలతో పాటు హీరోయిన్ రాశీ ఖన్నా కూడా సందడి చేయనుంది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన అప్‌డేట్‌ను ‘ఆహా’ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. త్వరలోనే ప్రోమోను కూడా విడుదల చేయనున్నట్లు పేర్కొంది. మొత్తానికి బాలయ్య షోకు ముగ్గురు తారలు కనిపించి అలరించబోతున్నారు. ఇక బాలకృష్ణ, వీరి నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టబోతున్నాడట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు