ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’ (Nari Nari Naduma Murari). ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం, క్లీన్ రోమ్-కామ్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఈ ఏడాది సంక్రాంతి సీజన్‌లో భారీ చిత్రాల మధ్య పోటీ ఉన్నప్పటికీ, తనదైన వినోదంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది.
ఈ చిత్రం ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో విడుదలైన కేవలం మూడు వారాల్లోనే ఈ సినిమా డిజిటల్ అరంగేట్రం చేయడం విశేషం. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఈ సినిమా అందుబాటులో ఉంది.
ఈ చిత్రంలో సంయుక్త మరియు సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటించగా, సునీల్, నరేష్ విజయకృష్ణ, సంపత్ రాజ్ మరియు వెన్నెల కిషోర్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి


