‘పెద్ది’ ట్రైలర్ తోనే మొత్తం క్లారిటీ!

‘పెద్ది’ ట్రైలర్ తోనే మొత్తం క్లారిటీ!

Published on May 14, 2026 10:04 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ అండ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రమే పెద్ది. అభిమానుల్లో భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం జూన్ లో గ్రాండ్ గా విడుదలకి రాబోతుంది. అయితే ఈ సినిమాకి రిలీజ్ గ్యాప్ లో భారీ ప్రమోషన్స్ ని కూడా మేకర్స్ ప్లాన్ చేస్తుండగా వాటిలో భాగంగా ఈ 18న ముంబైలో పెద్ది ట్రైలర్ లాంచ్ ని గ్రాండ్ చేయనున్నారు.

అయితే ట్రైలర్ పై ఇపుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుస్తుంది. దీని ప్రకారం పెద్ది ట్రైలర్ తోనే అసలు సినిమా ఏంటి అనేది క్లారిటీ వచ్చేస్తుంది అని ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల రివీల్ చేశారు. పెద్ద కథేంటి ఆడియెన్స్ ఏం చూడబోతున్నారు అనేది ట్రైలర్ తోనే చెప్పబోతున్నట్టు తాను ఖరారు చేశారు. సో పెద్ది విషయంలో ఒక క్లారిటీ అనేది అందరికీ ఈ 18తో వచ్చేస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహించారు.

తాజా వార్తలు