మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ లీడ్ రోల్లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. శశాంక్ యేలేటి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే పోస్టర్స్, టీజర్‌తో ఆడియన్స్‌లో అంచనాలు క్రియేట్ చేసింది. అయితే, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
ఈ క్రమంలో నందమూరి అభిమానులతో పాటు సినిమా లవర్స్‌కు ఈ చిత్ర యూనిట్ ఓ స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్ర ట్రైలర్‌కు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, బాలయ్య గతంలో ‘శ్రీమన్నారాయణ’ చిత్రంలో చెప్పిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అనే పవర్ఫుల్ డైలాగ్‌ను ఈ ట్రైలర్లో వినియోగించబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. బాలయ్య డైలాగ్‌తో రాబోయే ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ చిత్ర ట్రైలర్‌ను సెప్టెంబర్ 22న లాంచ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది.


