ప్రత్యేక ఇంటర్వ్యూ : రేష్మ – మెసేజ్, కామెడీ కలగలిపిన మూవీ ‘ప్రతి ఘటన’

ప్రత్యేక ఇంటర్వ్యూ : రేష్మ – మెసేజ్, కామెడీ కలగలిపిన మూవీ ‘ప్రతి ఘటన’

Published on Mar 31, 2014 6:10 PM IST

reshmi
‘ఈ రోజుల్లో’ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన తెలుగమ్మాయి రేష్మ. ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్న రేష్మ కీలక పాత్ర పోషించిన ‘ప్రతి ఘటన’ సినిమా ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. రేష్మ కాసేపు ఈ సినిమా విశేషాలను మాతో పంచుకుంది. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ముందుగా ఉగాది శుభాకాంక్షలు. మీ కెరీర్లో ఉగాదికున్న ప్రత్యేకత ఏమిటి?

స) మీక్కూడా ఉగాది శుభాకాంక్షలు. ఇక ఉగాది స్పెషల్ అంటే నా మొదటి రెండు సినిమాలు ‘ఈ రోజుల్లో’, ‘జై శ్రీ రామ్’ ఉగాది రోజున విడుదలయ్యాయి. ఇప్పుడు ప్రతి ఘటన కూడా ఉగాది దగ్గరలో రిలీజ్ కావడం ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందని నమ్మకంగా ఉంది.

ప్రశ్న) ముందుగా ఏప్రిల్ 5 అనుకున్న సినిమాని ఏప్రిల్ 18కి వాయిదా వేయడానికి గల కారణం ఏమిటి?

స) ముందుగా ఏప్రిల్ 5న అనుకున్నాం. కానీ మార్చి 28న లెజెండ్ వస్తోంది, ఆ తర్వాత కూడా వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. థియేటర్స్ దొరకవు అనే ఉద్దేశంతో ఏప్రిల్ 18కి వాయిదా వేశాము. ఏప్రిల్ 18న సుమారు 350 థియేటర్స్లో మూవీ రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నాం.

ప్రశ్న) ‘ప్రతి ఘటన’ సినిమా ఎలా ఉంటుంది?

స) ‘ప్రతి ఘటన’ సినిమా నిర్భయ ఘటన స్టైల్లో ఉంటుంది. ఒరిస్సాలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా కథని రాసుకున్నారు. ‘ప్రతి ఘటన’ ఒక మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. అలా అని సినిమా సీరియస్ గా ఉండదు. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఎంటర్టైన్మెంట్ కూడా మిక్స్ సినిమాకి తగ్గట్టు మిక్స్ చేసారు. బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, రఘుబాబు గారు చేసిన కామెడీ చాలా నవ్విస్తుంది.

ప్రశ్న) ప్రతి ఘటనలో మీ పాత్ర గురించి చెప్పండి?

స) ఈ సినిమాలో నేను కాలేజ్ లో చదువుకునే ఒక పక్కా పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. తన ఫ్రెండ్ కి జరిగిన అన్యాయం కోసం పోరాడుతూ తనే బలై పోయే పాత్ర. ఇప్పటి వరకూ బబ్లీ పాత్రలే చేసిన నేను మొదటి సారి ఒక పల్లెటూరి అమ్మాయిగా, పెర్ఫార్మన్స్ కి బాగా ప్రాధాన్యత ఉన్న పాత్ర చేసినందుకు ఆనందంగా ఉంది. ముఖ్యంగా నేను ఒక లా స్టూడెంట్ అందుకే ఈ సినిమాలో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటి ఉన్న అమ్మాయి పాత్రలో నటించడానికి ఒప్పుకున్నాను.

ప్రశ్న) విలక్షణ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారి గురంచి చెప్పండి?

స) తమ్మారెడ్డి భరద్వాజ్ గారు తన ప్రతి సినిమాలోనూ సమాజంలో ఉన్న ఇబ్బందులపై పోరాడేలా ఉంటాయి. అలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఓక డైరెక్టర్ తో పనిచేయడం చాలా హ్యాపీ. అలాగే ఆయనతో పని చేయడం వాళ్ళ నేను ఎంతో మారాను. చేసే ప్రతి పనిని మెచ్యూర్ గా ఆలోచించాలి. ఒక అమ్మాయికి ఉన్న సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలను ఆయన నుంచి నేర్చుకున్నాను.

ప్రశ్న) ఈ మూవీలో లీడ్ రోల్ చేసిన స్టార్ హీరోయిన్ చార్మీతో పనిచేయడం ఎలా ఉంది?

స) సినిమాలో చార్మీ గారిని అక్క అక్క అంటుంటాను. ఇప్పుడు బయట కూడా అదే అలవాటై పోయింది. సినిమా టైంలో చాలా సీన్స్ లో నాకు చాలా హెల్ప్ చేసారు. స్టార్ హీరోయిన్ అనే ఫీలింగ్ లేకుండా ఆమె వర్క్ చేస్తారు. రిలేషన్ పరంగా చాలా మంచి యాక్టర్.

ప్రశ్న) రియలిస్టిక్ సినిమా అన్నారు. మూవీలో మీరు బాగా రిస్క్ తీసుకొని చేసిన సీన్స్ ఏమన్నా ఉన్నాయా?

స) ఈ సినిమాలో బాగా రిస్క్ చేసిన సీన్స్ చాలానే ఉన్నాయి కానీ వాటన్నిటికీ నేను పెద్దగా ఇబ్బంది పడలేదు. కానీ మూవీలో కొన్ని హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఉండే సీన్స్ ఉన్నాయి. 5 రోజులు ఈ సీన్స్ చేసేటప్పుడు చాలా కష్టం అనిపించింది.

ప్రశ్న) వరుసగా లవ్ ఎంటర్టైనర్స్ చేసిన మీరు ‘ప్రతి ఘటన’ లో ఓ స్పెషల్ రోల్ చేయడానికి గల కారణం ఏమిటి?

స) వచ్చే 10 కథల్లో బబ్లీ అండ్ గ్లామరస్ పాత్రలే వస్తాయి. కానీ ఇలా పెర్ఫార్మన్స్ కి ప్రాధాన్యత ఉన్న కథలు చాల అతక్కువ వస్తాయి. అందుకే ఈ మూవీ చేసాను. నా నెక్స్ట్ మూవీలో మళ్ళీ ఓ బబ్లీ రోల్ చేస్తున్నాను.

ప్రశ్న) చివరిగా మా పాఠకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు?

స) ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు.. ‘ప్రతి ఘటన’ సినిమా చాలా సీరియస్ గా ఉంటుంది అనుకున్నాను. కానీ సినిమాలో మెసేజ్ తో పాటు, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ప్రేక్షకులకి నచ్చే సినిమా, అలాగే థియేటర్ కి వచ్చిన వారందరూ ఒక మంచి ఆలోచనతో బయటకి వచ్చే సినిమా ‘ప్రతి ఘటన’.

అంతటితో రేష్మకి ఆల్ ది బెస్ట్ చెప్పి మా చిట్ చాట్ ని ముగించాం..

రాఘవ

సంబంధిత సమాచారం

తాజా వార్తలు