ఇంటర్వ్యూ : సంపూర్ణేష్ బాబు – “క్యాలీఫ్లవర్”లో ఎగ్జైటింగ్ సీన్స్ చాలా ఉన్నాయ్

ఇంటర్వ్యూ : సంపూర్ణేష్ బాబు – “క్యాలీఫ్లవర్”లో ఎగ్జైటింగ్ సీన్స్ చాలా ఉన్నాయ్

Published on Nov 24, 2021 5:35 PM IST

ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో సదా ప్రేక్షకుల ప్రేమకు బానిస బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “క్యాలీఫ్లవర్” కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. మరి ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సంపూర్ణేష్ బాబు లేటెస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తాను ఇంకా ఎలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడో చూద్దాం.

చెప్పండి డైరెక్టర్ సినిమా కథ కోసం చెప్పినపుడు ఏమనిపించింది?

ఈ కథ చెప్పినపుడు శీలం అనేది ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా అంతే ముఖ్యం అనే పాయింట్ చెప్పారు. అదొక్కటి కాపాడుకుంటే ప్రపంచంలో ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పడంతో నాకు కథ కొంచెం కొత్తగా అనిపించింది. అందుకే ఓకే చేశా.

ఈ సినిమాలో అంత ఎగ్జైటింగ్ గా ఉండే పాయింట్ ఏమన్నా ఉందా?

సినిమాలో నావి రెండు గెటప్స్ ఉన్నప్పుడూ అలాగే ముగ్గురు లేడీ విలన్స్ పై సీన్లు, ఇంకా ఎక్కడ ఎంజాయ్ చేస్తారు అంటే హీరో రేప్ కి గురైనప్పుడు సాంగ్ రిలీజ్ చేశారు అలాంటి చాలా సన్నివేశాలు ఎగ్జైటింగ్ గా అనిపిస్తాయి.

మీ డైరెక్టర్ కోసం చెప్పండి?

డైరెక్టర్ ఆర్ కె ఇంతకు ముందు చాలా సీరియల్స్ కి చేశారు. అలాగే ఓ సినిమా కూడా చేసారు, ఇది రెండోది. ఈ కథ ఎప్పుడు నుంచో చెయ్యాలని అనుకుంటుంది అట. ప్రతి రోల్ ఇలా ఉండాలి అనుకున్నారు. నేను కూడా సినిమా చేసినప్పుడు నార్మల్ గానే చేశాను కానీ నా పోస్టర్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి షాక్ అయ్యాను.

హీరోయిన్ కోసం ఏమన్నా చెప్పండి?

హీరోయిన్ వాసంతి ముందు రెండు మూడు సీరియల్స్ చేసింది, తాను బెంగళూర్ అమ్మాయి. తెలుగులో అయితే మొదటి సినిమా ఇదే. నా రోల్ కి కరెక్ట్ రోల్ లో కనిపిస్తుంది. అమ్మాయి ఫస్ట్ టైం అయినా కానీ బాగా చేసింది.

మరి హీరోగా కాకుండా వేరే సినిమాల్లో క్యారెక్టర్స్ చెయ్యడం లేదా?

ఇంతకు ముందు చేశాను కానీ ఇప్పుడు అయితే ఒక సినిమాలో చేస్తున్నా. హీరోగా నాలుగైదు సినిమాలు ఉన్నాయి. వేరే సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చెయ్యాలని నాకు కూడా ఉంది. అవకాశం ఉంటే ఖచ్చితంగా 100 పర్సెంట్ చేస్తాను.

స్టీవెన్ శంకర్ తో మళ్ళీ సినిమా ఉందా?

వచ్చే ఏడాదిలో ఉండొచ్చు, ప్రస్తుతం తాను అయితే ఆనంద్ దేవరకొండతో చేస్తున్నాడు. మళ్ళీ ఇద్దరి కాంబినేషన్ లో చెయ్యాలని చూస్తున్నా.

ఫైనల్ గా ఐదు సినిమాలు చేస్తున్నా అన్నారుగా అన్నీ ఇలాంటి సినిమాలేనా?

లేదు అన్నీ వేరే వేరే జానర్ సినిమాలే. అందులో ఒకటి తమిళ్ సినిమా కూడా చేస్తున్నాను. అది కూడా దాదాపు 70 శాతం వరకు అయ్యిపోయింది. ఇంకో పది పదిహేను రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కూడా అయ్యిపోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు