మొదటి రోజు డీసెంట్ కలెక్షన్లను రాబట్టిన 118 !

Published on Mar 2, 2019 10:50 am IST

పటాస్ తరువాత మళ్ళీ అలాంటి విజయం కోసం చాలా రోజులుగా ఎదురుచూశారు నందమూరి కళ్యాణ్ రామ్. ఇక ఎట్టకేలకు ఆయన ‘118’ తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. నిన్న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూస్ తోపాటు మంచి మౌత్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో ఈ చిత్రం మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్ ను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈచిత్రం మొదటి రోజు 1.50 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈరోజు ,రేపు అలాగే సోమవారం కూడా హాలీడే కావడం సినిమాకి కలిసి రానుంది.

ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో కేవి గుహన్ తెరకెక్కించిన ఈచిత్రంలో నివేత థామస్, శాలిని పాండే కథానాయికలుగా నటించగా శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకం ఫై మహేష్ ఎస్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం :